మార్కెట్ విలువ రూ. 750 కోట్లు. మహారాష్ట్ర తర్వాత ఉల్లి ఉత్పత్తి చేసే రాష్ట్రం కర్ణాటక..కర్ణాటకలో కూడా ...ఉల్లి దిగుబడి బాగానే చేస్తుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఉల్లి ఉత్పత్తి 43 శాతం మహారాష్ట్ర ఒక్కటే . ఆసియాలోనే అతి పెద్ద ఉల్లి మార్కెట్ నాసిక్ లో లాసల్ గావ్ లో ఉంది. ఈ మార్కెట్ లో ప్రతి రోజు పెద్ద ట్రక్కులు ఉల్లిపాయలు వేలం వేస్తారు . మార్కెట్ విలువ రూ. 750 కోట్లు. మహారాష్ట్ర తర్వాత ఉల్లి ఉత్పత్తి చేసే రాష్ట్రం కర్ణాటక..కర్ణాటకలో కూడా ...ఉల్లి దిగుబడి బాగానే చేస్తుంది.
చెన్నైలో కిలో రూ.100 నుంచి 110 వరకు విక్రయిస్తున్నారు. అసలు ఉల్లి దిగుబడి బాగా పండే ముంబై , పూణే లో ఉల్లి రేటు 80 పై మాటే. అయితే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ దుకాణాల్లో కిలో ఉల్లిని రూ.35కు విక్రయిస్తోంది. ఢిల్లీ తో పాటు చాలా రాష్ట్రాలకు ఉల్లిని ప్రత్యేక రైళ్ల ద్వారా సరఫరా చేస్తున్నా...ఫలితం లేదు. రోజు రోజుకు రేట్లు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉల్లి కిలో రూ.80 నుంచి రూ.90కి విక్రయిస్తున్నారు.రానున్న రోజుల్లో ఉల్లి మరింత రేట్లు పెరిగే అవకాశముంది.
ప్రపంచంలోనే ఉల్లిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం చైనా. భారత్ రెండో స్థానంలో ఉంది.చైనా ఉల్లిని ఎక్కువగా పండిస్తున్నప్పటికీ, ఎగుమతుల్లో మాత్రం భారత్ కంటే వెనుకబడి ఉంది. కాని ప్రస్తుత పరిస్థితులు భారత్ లో ఉల్లి దిగుబడి సరిపోవడం లేదనే చెప్పాలి. భారతదేశం దాదాపు 2.5 మిలియన్ టన్నుల ఉల్లిని ఎగుమతి చేసింది. తరువాత భారతదేశం బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నేపాల్, మలేషియా, శ్రీలంక మరియు ఇండోనేషియాకు పెద్ద మొత్తంలో ఉల్లిపాయలను ఎగుమతి చేసింది. అయితే ఈ యేడాది చాలా చోట్ల వరదలు..తుఫాన్లు , వర్షాలు కారణంగా చాలా వరకు పంట నష్టపోయారు దీంతో దిగుబడి తగ్గింది. అందుకే ఈ ధరలు అంటున్నారు రైతులు.