Hydra: మరింత బలంగా మారుతున్న హైడ్రా..

హైడ్రపై మరింత ప్రభావభరితంగా పని చేసేందుకు రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా శాటిలైట్ ఫోటోలను తెప్పించి పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే, భవనాల కూల్చివేత కోసం హైడ్రా అధికారులు మఫ్టీలో వెళ్లి పరిశీలిస్తారు. 


Published Aug 25, 2024 01:06:25 AM
postImages/2024-08-25/1724565487_HYDRAranganath.jpg

న్యూస్ లైన్ డెస్క్: హైడ్రాకు మరింత బలాన్ని చేకూర్చాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. దీంతో పీఎస్ స్టేటస్ తో హైడ్రానే నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసే వెసులుబాటు ఉండనుంది. 

దీనిపై మరో రెండు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఇప్పటికే హైడ్రా కూల్చేసిన భవనాల అనుమతులపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో  పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునే విషయంపై చర్చలు జరిపించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై కూడా ఉన్నతాధికారులతో చర్చించి పర్మిషన్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

కాగా గడిచిన మూడు నెలల్లోనే నగరంలో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. హైడ్రపై మరింత ప్రభావభరితంగా పని చేసేందుకు రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా శాటిలైట్ ఫోటోలను తెప్పించి పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే, భవనాల కూల్చివేత కోసం హైడ్రా అధికారులు మఫ్టీలో వెళ్లి పరిశీలిస్తారు. అనంతరం రాత్రి వేళల్లోనే వాహనాలను భవనాల వద్దకు పంపించి తెల్లవారేసరికి భవనాల కూల్చివేత పనులను ప్రారంభిస్తారు. 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu hyderabad telanganam congress-government hydra-commisioner hydra hydra-commissioner-ranganath water-reservoirs

Related Articles