AUSTRALIA: ఆస్ట్రేలియా ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం ..అక్కడ సోషల్ మీడియా బ్యాన్

పిల్లలు సోషల్‌ మీడియా వినియోగించకుండా నిషేధం విధిస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ ప్రకటించారు.


Published Sep 14, 2024 02:29:00 PM
postImages/2024-09-14/1726304412_66a6356208e7f568ce5249e180dbfe8a.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.పిల్లలు సోషల్ మీడియా ఎఫెక్ట్ తో పాడైపోతున్నారని చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంది. ఎలా అయితే ఓటు హక్కు వినియోగించుకోవడానికి , కొన్ని పనులు చెయ్యడానికి ఏజ్ లిమిట్ ఉందో సోషల్ మీడియా వాడడానికి కూడా ఓ ఏజ్ లిమిట్ ను పెట్టింది. పిల్లలు సోషల్‌ మీడియా వినియోగించకుండా నిషేధం విధిస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌  ప్రకటించారు. 


సోషల్ మీడియా, ఇతర సంబంధిత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయడానికి కనీస వయస్సును అమలు చేయడానికి ప్రభుత్వం ఓ చట్టం చేస్తున్నట్లు అఫిషియల్ గా అనౌన్స్ చేసింది.“సోషల్ మీడియా సామాజిక హాని కలిగిస్తోందని మాకు తెలుసు. ఇది పిల్లలను నిజమైన స్నేహితులు, నిజమైన అనుభవాల నుండి దూరం చేస్తోంది” అని ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 


ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాల‌తో చ‌ర్చల అనంత‌రం ప్రత్యేక చట్టంపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయ‌న వెల్లడించారు. పిల్లలు సోషల్ మీడియా ఎఫెక్ట్ తో ..తమ వయసు కంటే ముందే చెడిపోతున్నారని ...సరైన వయసు రాకుండా చాలా విషయాలు తెలుసుకోవడం తమ బాల్యాన్ని చిదిమేయడమేనని తెలిపారు. దీనిలో భాగంగా ముఖ్యంగా సోష‌ల్ మీడియా వినియోగానికి పిల్లల‌ కనీస వయస్సు 16 ఏళ్లుగా నిర్ణయించడమే తన అభిమతమని ఈ సంద‌ర్భంగా ప్రధాని అన్నారు.16 యేళ్ల తర్వాతే ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ను యూజ్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu childhood social-media australia

Related Articles