VENU:బలగం వేణు 'ఎల్లమ్మ'లో  ఆ స్టార్ హీరో..నాని కాదు..ఎవరంటే.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా ఎంతో పేరు తెచ్చుకున్నారు బలగం వేణు. జబర్దస్త్ ద్వారా తన క్రేజ్ మరింత దూసుకెళ్లింది. అలాంటి వేణు కామెడీ పాత్రలకు స్వస్తి పలికి


Published Sep 14, 2024 04:54:35 PM
postImages/2024-09-14/1726313075_BALAGAM.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా ఎంతో పేరు తెచ్చుకున్నారు బలగం వేణు. జబర్దస్త్ ద్వారా తన క్రేజ్ మరింత దూసుకెళ్లింది. అలాంటి వేణు కామెడీ పాత్రలకు స్వస్తి పలికి బలగం సినిమా ద్వారా డైరెక్టర్ గా మారారు. బలగం అనే చిన్న కాన్సెప్ట్ తో  వచ్చి భారీ హీట్ అందుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా  సంచలనం సృష్టించింది. ఈ చిత్రాన్ని ఊర్లకు ఊర్లే స్పెషల్స్ స్క్రీన్స్ పెట్టుకుని చూశారంటే సినిమా ఎంతటి ఆదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు.

ఒక సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారారు బలగం వేణు. అలాంటి వేణు తదుపరిచిత్రం ఎల్లమ్మ  చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో  నాని హీరో అని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కథ విన్న తర్వాత  నాని ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారట. నానికి కథ నచ్చలేదు నేను ఈ చిత్రం చేయనని చెప్పడంతో  బలగం వేణు తాజాగా ఈ సినిమాని హీరో నితిన్ తో చేయాలని డిసైడ్ అయ్యారట.

అంతే కాదు కథలో మరిన్ని మార్పులు చేసి త్వరలో నితిన్ కి కథ కూడా వినిపించబోతున్నట్టు తెలుస్తోంది.  ఒకవేళ నితిన్ కు కథ నచ్చితే మాత్రం వీరిద్దరి కాంబోలో మరో క్రేజీ చిత్రం తప్పక మనం చూడాల్సిందే. అంతేకాకుండా హీరో నితిన్,  విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ఒక పాన్ ఇండియా సినిమా కూడా చేయబోతున్నట్టు తెలుస్తోంది.  ఈ చిత్రానికి బడ్జెట్ 80 కోట్ల నుంచి 100 కోట్లు దాటే అవకాశం ఉందట.. మరి చూడాలి ఈ ఇద్దరు డైరెక్టర్లలో నితిన్ కు  హిట్ ఇచ్చే వారెవరో ముందు ముందు తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nithin nani balagam-venu yellamma-movie director-vikram-kumar

Related Articles