devara:ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..టికెట్ రేట్లు తెలిస్తే షాకే.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి అభిమానులు ఉంటారో మనందరికీ తెలుసు. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అప్పటినుంచి


Published Sep 14, 2024 08:40:12 AM
postImages/2024-09-14/1726320773_devara.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి అభిమానులు ఉంటారో మనందరికీ తెలుసు. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అప్పటినుంచి ఈయన రేంజ్ మరింత పెరిగిపోయింది. అయితే ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్  కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.  పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక బడ్జెట్ తో  తెరకెక్కుతున్న ఈ మూవీలో కథానాయికగా  బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ చేస్తున్నారు.  

ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, పాటలు,  రిలీజ్ అయి కోట్లాదిమంది అభిమానుల మన్ననలు  పొందింది. ఈ తరుణంలో సినిమా  సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుండడంతో  అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.  అలాంటి ఈ తరుణంలో దేవర చిత్ర యూనిట్ ఒక బ్యాడ్ న్యూస్ అందించింది.

అయితే ఈ సినిమా టికెట్ రేట్లను పెంచుతున్నట్టు తెలుస్తోంది.  రెండు తెలుగు రాష్ట్రాలలోని తెలంగాణలో మల్టీప్లెక్స్ లలో రూ:413, సింగిల్ స్క్రీన్లలో రూ:250, అలాగే ఏపీలో మల్టీప్లెక్స్ లలో రూ:325, సింగిల్ స్క్రీన్ లో రూ:200 రూపాయలు పెంచుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి చూడాలి ఈ సినిమా రిలీజ్ అయి ఎలాంటి రికార్డు సాధిస్తుందో ముందు ముందు తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : news-line ticket-rates jr-ntr devara johnvi-kapoor koratala-shiva

Related Articles