పూరీ లో ప్రతి యేడాది జగన్నాధుడికి , బలరాముడికి , సుభద్రా దేవికి జలుబు చేసి జ్వరం వస్తుంది. నవ్వులాట కాదు నిజంగా వస్తుంది. ప్రతి యేడాది రథోత్సవం ముందు జ్యేష్ఠ పౌర్ణమికి స్వామి వారికి ..బలరాముల వారికి 108 కలశాలతో స్నానం చేయిస్తారు. స్నానం చేయించి కొత్త బట్టలు కట్టి ...స్వామి వారిని రథం ఎక్కిస్తారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పూరీ లో ప్రతి యేడాది జగన్నాధుడికి , బలరాముడికి , సుభద్రా దేవికి జలుబు చేసి జ్వరం వస్తుంది. నవ్వులాట కాదు నిజంగా వస్తుంది. ప్రతి యేడాది రథోత్సవం ముందు జ్యేష్ఠ పౌర్ణమికి స్వామి వారికి ..బలరాముల వారికి 108 కలశాలతో స్నానం చేయిస్తారు. స్నానం చేయించి కొత్త బట్టలు కట్టి ...స్వామి వారిని రథం ఎక్కిస్తారు.
ఈ ఏడాది రెండు రోజులు జరిగింది రథోత్సవం ..తిథులు రెండు రోజులు రావడంతో రెండు రోజులు చేశారు. ఇలా రథోత్సవం జరిగిన తర్వాత గుడించి దేవాలయానికి వెళ్లగానే స్వామి వారికి ..జ్వరం వస్తుంది. విగ్రహాలు వేడెక్కుతాయట. 108 బిందెల నీళ్లు పోస్తే స్వామికి జలుబు చేస్తుందిగా..అలా జలుబు చేస్తుంది. 15 రోజులు స్వామివారికి ఆవిరిపట్టు వేసి నయం అయ్యే వరకు తీర్ధప్రసాదాలు లేకుండా జ్వరం మనుషులు తినే భోజనాన్ని అందిస్తారు.
ఈ పదిహేను రోజులనూ అనాసారగా పిలుస్తారు. ఈ సమయంలో భక్తుల కోసం గర్భ గుడిలో జగన్నాథుడి పాత చిత్రాలు (పెయింటింగ్) ప్రదర్శిస్తారు. స్వామి వారు ఎలా ఉండేవారు ఎలా నీరసపడిపోయారని అంటూ దర్శనాలు చేసుకుంటారు. ఈ క్రతువులన్నీ సాంప్రదాయపధ్ధతుల్లో చేస్తూ ఉంటారు. ఆఖరి రోజు అంటే ఏకాదశి గడిచిన మూడో రోజు స్వామి వారి ఆలయంలో పూరీ ప్రసాదంగా పిలవబడే ...చప్పన్ భోగ్గా పిలిచే 56 రకాల నైవేద్యాలు స్వామి వారికి అర్పిస్తారు.
15 రోజుల తరువాత దేవుడికి నయం అయిపోయిందని రాజవైద్యుడు ప్రకటిస్తాడు. అభిషేకం వల్ల విగ్రహాలకు రంగు వెలుస్తుంది కాబట్టి కొత్త రంగులు వేస్తారు. జ్వరం తగ్గిపోయాక స్వామి వారి దర్శనం ఉంటుంది...ఈ దర్శనాన్ని " నవయవ్వన దర్శనం " అంటారు. అప్పుడు రథ యాత్ర ప్రారంభిస్తారు.
సాక్షాత్తూ దేవదేవుడే అయినప్పటికీ, శరీరంతో ఆయన అక్కడ ఉన్నాడని భావించి, మనిషికి చేసినట్టే సపర్యలు చేస్తారు భక్తులు. పురాణాల్లోను కృష్ణ హృదయం ఇక్కడ జగన్నాధునిలో ఉందని నమ్ముతారు .