ఏం చేస్తాం అదేమైనా సైకిలా ..బైకా చేతులతో తోసేయడానికి అంటారేమో...ట్రైన్ ఆగింది ..జనాలంతా ట్రైన్ ను చేతులతో తోసుకువెళ్లారు కూడా.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బైకో,కారో , లేదా బస్సు రోడ్డు మీద ఆగిపోతే ఏం చేస్తాం...చేతులతో తోస్తూ స్టార్ట్ అవుతుందేమో ట్రై చేస్తాం.అదే పట్టాలపై రైలు ఆగిపోతే ఏం చేస్తాం. ఏం చేస్తాం అదేమైనా సైకిలా ..బైకా చేతులతో తోసేయడానికి అంటారేమో...ట్రైన్ ఆగింది ..జనాలంతా ట్రైన్ ను చేతులతో తోసుకువెళ్లారు కూడా.
పట్టాలపై ఆగిపోయిన ఓ రైలును రైల్వే సిబ్బంది, ఉద్యోగులు, స్థానికులు, ప్రయాణికులు అందరు కలిసి ముందుకు తోస్తున్న వీడియో వైరల్ అవుతుంది.. కొంతదూరం నెట్టిన తరువాత అది స్టార్ట్ అయింది. సేమ్ టు సేమ్ బైకులాగే .. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ ప్రాంతంలో రైల్వే కార్మికులు బ్రేక్ డౌన్ అయిన రైలును కొద్ది దూరం వరకు నెడుతూ కనిపించారు. వీరికి పాపం చుట్టుప్రక్కల ప్రజలు, ప్రయాణికులు కూడా సాయం చేశారు . ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. అయితే యూపీ లో ఈ సంఘటనలు పెద్ద కొత్తేం కాదు..ఎప్పటి లాగే జరగుుతూనే ఉంటాయి. అయినా బయట రాష్ట్రాలకు కొత్త గా ఉంటుందని పోస్ట్ చేస్తున్నానంటు వీడియో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అయిపోతున్నారు. రైల్వే మెయింటెనెన్స్ పై కౌంటర్లు వేస్తున్నారు.