ఈ మూవీకి కల్యాణ్ చక్రవర్తి డైరెక్టర్ మాత్రమే కాదు.. ప్రొడ్యూసర్ కూడా. సినిమా ఎలా ఉందో చూసేద్దాం రండి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టాలీవుడ్ లో కాన్సెప్ట్ లకు కొదవ లేదు. ప్రతి వారం ఓ కొత్త కాన్సప్ట్ థియేటర్ లో ...ఓటీటీలో దర్శనమిస్తూనే ఉంటుంది. రీసెంట్ గా టైమ్ ట్రావల్ కాన్సప్ట్ లో వచ్చిన సినిమా రివైండర్ ..ఎప్పుడో ఆదిత్య 369 సినిమా తర్వాత మళ్లీ తెలుగులో టైమ్ ట్రావల్ సినిమాలు కనిపించలేదు. ఇలాంటి జానర్ టచ్ చేయడానికి ఎక్కువ మంది ధైర్యం చేయరు. కానీ, కల్యాణ్ చక్రవర్తి ఆ ధైర్యం చేశారు. రివైండ్ అనే ఒక టైమ్ ట్రావెల్ ఎంటర్ టైనర్ ను తీసుకొచ్చారు. ఈ మూవీకి కల్యాణ్ చక్రవర్తి డైరెక్టర్ మాత్రమే కాదు.. ప్రొడ్యూసర్ కూడా. సినిమా ఎలా ఉందో చూసేద్దాం రండి.
కార్తిక్ ఒక సాఫ్ట్ వేర్ డెవలప్పర్. ఛాలెంజెస్ అంటే అతనికి ఇష్టం. సరదాగా సాగిపోతున్న కార్తిక్ లైఫ్ లోకి ఒకరోజు అనుకోకుండా శాంతి వస్తుంది. ఆమెను చూడగానే కార్తిక్ ప్రేమలో పడిపోతాడు. లక్కీ గా తను కూడా సేమ్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు. ఆ టైంలో శాంతి తన తాత గురించి చెబుతుంది. ఈ కథలో తన తాతదే మెయిన్ పాత్ర.ఎందుకంటే ఆ కృష్ణమూర్తే టైమ్ మిషన్ ని కనిపెట్టింది. తర్వాత కార్తిక్ శాంతితో తన ప్రేమను చెప్పడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒకరోజు శాంతి.. కార్తిక్ కు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుంది.
తన ప్రేమను చెబుతామనుకుంటాడు . కాని శాంతి షాక్ ఇస్తుంది. వేరే కుర్రాడిని తీసుకొచ్చి ప్రేమిస్తున్నానంటుంది. శాంతి మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్న కార్తిక్ మనసు విరిగిపోతుంది. చిన్నప్పుడే తల్లిని.. కరోనా సమయంలో తండ్రిని కోల్పోయిన కార్తిక్.. ఇంక తన లైఫ్ లో ప్రేమ అనేది ఉండదు అని ఫిక్స్ అయిపోతాడు. అలాంటి టైంలో కార్తిక్ కి టైమ్ మిషన్ దొరుకుతుంది. అతను ఆ టైమ్ ట్రావల్ ను వాడాడా...ఎలా వాడాడు. అసలు టైమ్ ట్రావెల్ తో శాంతిని ఎలా ప్రేమలో పడేశాడు అనేదే స్టోరీ.
ఈ సినిమా లో సాయి రోనక్ ఒక హీరో అయితే ..డైరక్టర్ మరో హీరో. స్టోరీ ఇలాంటి టైంలో స్క్రీన్ మీద హై రిస్క్ . కాని చాలా బాగా తీశారు. హీరో హీరోయిన్ మరో పెద్ద ఎసెట్ . అధ్భుతంగా చేశారు. కాస్త స్లో గా అనిపించినా...సూపర్ గా ఉంది.