SOUNDARYA: సౌందర్య నిర్మించిన ఏకైక సినిమా ఇదే !


సౌందర్య.. సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఆమె నాన్న సత్యనారాయణ అయ్యర్‌ కన్నడలో రైటర్‌గా, నిర్మాతగా రాణించారు. పలు సినిమాలు నిర్మించారు.


Published Oct 10, 2024 07:00:00 PM
postImages/2024-10-10/1728567161_img220240715t140417.53520240792bda801618cb8f40d72dae6ed455364.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సౌందర్య ఎన్నో సినిమాలు చేసింది. నటిగా తనను తాను ప్రతి సినిమాలోను ప్రూవ్ చేసుకుంది.  పేరుకి కన్నడ అమ్మాయే అయినా ..జనాలందరికి సౌందర్య అచ్చ తెలుగు అమ్మాయి. అలా కలిసిపోయింది. సౌందర్య ఫ్యామిలీ కూడా సినీ ఇండస్ట్రీ ఫ్యామిలీనే.


సౌందర్య.. సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఆమె నాన్న సత్యనారాయణ అయ్యర్‌ కన్నడలో రైటర్‌గా, నిర్మాతగా రాణించారు. పలు సినిమాలు నిర్మించారు. రైటర్‌గానూ పనిచేశారు. తండ్రి కారణంగానే సినిమాల్లోకి వచ్చింది సౌందర్య. ఓ సినిమాలో చిన్న క్యారక్టర్ కోసం అమ్మాయి కావాలంటే సౌందర్యను స్కూల్ నుంచి తీసుకొచ్చి డైరక్టర్ కు చూపించారట. అప్పటికి సౌందర్యకు సినిమాల మీద అంత ఇంట్రస్ట్ లేదు. సినిమా లు వద్దు చదువుకుంటానని చెప్పిందట. కాని ఏదో సరదాగా ఒకటి రెండు సినిమాలు చెయ్యమంటే చేసిందట. ఆ తర్వాత స్టార్ డమ్ వచ్చింది. సౌందర్య లుక్స్ కు అటు కన్నడ ఇండస్ట్రీ ..ఇటు తెలుగు ఇండస్ట్రీ రెండు పూల పాన్సులు వేశాయి.


ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. దీంతో చదువు పక్కన పెట్టి సినిమాల్లోకి వచ్చేసింది. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె చదువుని పూర్తిగా వదిలేసింది. చాలా బిజీ ఆర్టిస్ట్ . ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసేది. కెరియర్ పీక్ లో ఉన్నపుడు సౌందర్య ఫాదర్ చనిపోయారు. చాలా కృంగిపోయింది. తన తండ్రి కోసం ఏదైనా చెయ్యాలనిపించింది. సినిమా లకోసమే ఆలోచించే నాన్నకు ట్రిబ్యూట్ గా ఓ సినిమా చెయ్యాలని నిర్ణయించుకుంది. నాన్న పేరుతోనే బ్యానర్ ను లాంఛ్ చేసి `సత్య మూవీ మేకర్స్` పేరుతో కొత్తగా నిర్మాణ సంస్థని ప్రారంభించి 2002లో `ద్వీప` అనే సినిమాని నిర్మించింది. కన్నడ సినిమా ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా ..లీడ్ రోల్ సౌందర్య నే. థియేటర్ పర్లేదనిపించింది. పెద్ద హిట్టు కాదు ..కాని ఓకే ఓకే . కాని ఈ సినిమాకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. ఆ ఏడాది ఉత్తమ చిత్రం , బెస్ట్ కెమరా వర్క్ లో మరో నేషనల్ అవార్డు సంపాదించుకుంది. హిట్టు కొట్టినా ఇక ఆ బ్యానర్లో సినిమా చెయ్యలేదు. ఆమె నటించిన `నర్తనశాల` మధ్యలోనే ఆగిపోగా, నాలుగేళ్ల క్రితం ఓటీటీలో విడుదల చేశారు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news kannada soundarya

Related Articles