Shravana Masam: తెలుగు రాష్ట్రాల్లో శ్రావణమాస సందడి.. !

ఈ రోజు శ్రావణ మంగళవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారి దేవాలయాలు భక్తులతో పోటెత్తుతున్నాయి.


Published Aug 06, 2024 07:54:00 AM
postImages/2024-08-06/1722911147_DurgammaDarshan.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పంచాంగంలో ప్రతి నెలకు ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా శ్రావణం, కార్తీక మాసాలను హిందువులు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ రెండు నెలల్లో ఎన్నో శుభకార్యాలు జరుగుతుంటాయి. ఈ రోజు శ్రావణ మంగళవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారి దేవాలయాలు భక్తులతో పోటెత్తుతున్నాయి. దేవాలయాలన్నీ శ్రావణ శోభతో అలరారుతున్నాయి.ఈ మాసంలో మహిళలు వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతాలు చేస్తారు. అంతేకాక శివుడికి శ్రావణ సోమవారం రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. 


విష్ణువు, ఆయన భార్య లక్ష్మీ దేవిలకు శ్రావణం అత్యంత ప్రీతికరమైనది. పైగా శ్రావణమాసంలోనే శ్రీకృష్ణుడు, హయగ్రీవ అవరాలు జరిగాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక శ్రావణమాసంలోనే సముద్ర మదనం చేశారని పురణాలు చెబుతున్నాయి. అందుకే ఈ మాసంలో ఆడవారు , ముత్తెదువులు పార్వతి దేవికి , మహాలక్ష్మి పూజలు చేస్తుంటారు. అంతేకాదు తెల్లవారే 4 గంటల నుంచి కుంకుమార్చనలతో దేవాలయాలన్ని రద్దీ మొదలవుతుంది.


అంతేకాక ఈ నెలలో వ్రతాలు, నోములు, పూజలు చేస్తే.. సకల సౌభాగ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. మంగళగౌరి వ్రతం. జాతకంలో కుజదోశం ఉన్న వారు.. మంగళగౌరి వ్రతం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని అంటారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అమ్మవారి దేవాలయాలన్నీ ఈ రోజు కుంకుమార్చనలతో అభిషేకాలతో కన్నులపండుగగా ఉంటాయి.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu sravanam temple pooja

Related Articles