ఈ రోజు అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ అష్టకంతో భక్తులు పూజిస్తే .. విశేష ఫలితాలు ఉంటాయని శాస్త్ర పండితులు చెబుతుంటారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దుర్గమ్మ నవరాత్రుల్లో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నిత్యం చాలా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అయితే నవరాత్రుల్లో ఆరో రోజైన ఈ రోజు అమ్మవారు మహాలక్ష్మి దేవిగా దర్శనమిచ్చారు. ఈ రోజు అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ అష్టకంతో భక్తులు పూజిస్తే .. విశేష ఫలితాలు ఉంటాయని శాస్త్ర పండితులు చెబుతుంటారు.
ఈ రోజు "ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః " అని మంత్రం చదివితే చాలా మంచిది.
ఈ రోజు కనకమహాలక్ష్మి దేవి పూజకు తెల్లని పూలు ..చాలా ఇష్టం . అమ్మవారికి తెల్లని వస్త్రాలతో కాని తెల్లని పూలతో ..పూజలు చేస్తే అమ్మవారికి చాలా నచ్చుతాయి.
రేపు జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేని విధంగా చర్యలు చేపట్టినట్లు అధికారులు ప్రకటించారు. మూలానక్షత్రం రోజు న లక్షన్నర నుండి రెండు లక్షల వరకూ భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది.