మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ కమిషన్ల కోసమే డిజైన్లు మార్చారని, ప్లేస్ మార్చారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ ఆరోపించారని ఆయన గుర్తుచేశారు. అయితే, కాంగ్రెస్ వాళ్లు డిజైన్ చేసిన రాజీవ్ సాగర్ వేలేరుపాడులో ఉంది. ఇప్పుడు ఆ వేలేరుపాడు ఆంధ్రలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం అక్కడికి వెళ్లి ప్రాజెక్టు కట్టదు కదా అని మధు ప్రశ్నించారు.
న్యూస్ లైన్ డెస్క్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోయి ఉండే మాట్లాడుతున్నారా అంటూ BRS ఎమ్మెల్సీ తాతా మధు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఖమ్మంలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ నేతల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ కమిషన్ల కోసమే డిజైన్లు మార్చారని, ప్లేస్ మార్చారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ ఆరోపించారని ఆయన గుర్తుచేశారు. అయితే, కాంగ్రెస్ వాళ్లు డిజైన్ చేసిన రాజీవ్ సాగర్ వేలేరుపాడులో ఉంది. ఇప్పుడు ఆ వేలేరుపాడు ఆంధ్రలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం అక్కడికి వెళ్లి ప్రాజెక్టు కట్టదు కదా అని మధు ప్రశ్నించారు.
కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రాజెక్టు కాస్ట్ పెంచారు అని మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ప్రాజెక్ట్ డిజైన్ చేసినప్పుడు అక్కడ భూమి విలువ ఎంత అని ప్రశ్నించారు. స్టీల్, సిమెంటు కాస్ట్ ఎంత? లాండ్ ప్రొక్యూర్మెంట్ ఎంత రేటు పెరిగింది? అని నిలదీశారు. పాలేరు భక్తురామదాసు ప్రాజెక్టు కట్టకముందు ల్యాండ్ రేటు రూ.50 వేలు, రూ.60 వేలు ఉండేదని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ రేటుకు ఎవరైనా భూమి ఇస్తారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం రూ.25 లక్షల కన్నా తక్కువలో భూమి ఎక్కడా దొరకదని అన్నారు.
సీతారామ ప్రాజెక్టుకి అన్ని పర్మిషన్లు తామే తెచ్చామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. అతను సోయి ఉండి మాట్లాడుతున్నారో, సోయలేక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ముందుచూపుతో సీతారామ ప్రాజెక్ట్, సీతమ్మ సాగర్ అని పేరుపెట్టకపోతే.. కాంగ్రెస్ వాళ్లు ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ అని పేరు మార్చేసేవాళ్లని మధు ఎద్దేవా చేశారు.