ఏప్రిల్ 15 వ తేదీ నంుచి రాష్ట్ర వ్యాప్తంగా చాలా పరీక్ష కేంద్రాల్లో ప్రారంభం అవుతున్నాయి. హాల్ టికెట్స్ హైకోర్టు జారీ చేసింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోర్టు ఉద్యోగాల రాత పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు గురువారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రాత పరీక్షలు ఈ నెలలోనే ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 15 వ తేదీ నంుచి రాష్ట్ర వ్యాప్తంగా చాలా పరీక్ష కేంద్రాల్లో ప్రారంభం అవుతున్నాయి. హాల్ టికెట్స్ హైకోర్టు జారీ చేసింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లు నమోదు చేసి హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేసన్ కింద సుమారు 1673 ఎగ్జామినర్ , జూనియర్ అసిస్టెంట్ , ఫీల్డ్ అసిస్టెంట్ , రికార్డ్ అసిస్టెంట్ , కాపీయిస్ట్ , సబ్ ఆర్డినేట్ సర్వీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగులకు ఎగ్జామ్ ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీ వరకు షిఫ్ట్ ల వారీగా తెలంగాణ హైకోర్టు నిర్వహించనుంది.
ఏ పరీక్ష ఎప్పుడంటే..
ఎగ్జామినర్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 15, 2025.
జూనియర్ అసిస్టెంట్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 16, 2025.
ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 20, 2025.
రికార్డ్ అసిస్టెంట్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 20, 2025.
కాపీయిస్ట్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 15, 2025.
టైపిస్ట్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 15, 2025.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 6 యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫిసర్ పోస్టులను భర్తీ చేసేందుకు సర్కార్ కసరత్తులు ప్రారంభించింది. పోస్టుల భర్తీ చేసేందుకు సర్కారు కసరత్తులు ప్రారంభించింది. పోస్టులను భర్తీ చేసేందుకు న్యాయపరంగా సాంకేతికంగా కార్యనిర్వాహక కమిటీలు తొలుత ఏర్పాటు చేస్తున్నారు.