కాళోజీ పేరు మీద హెల్త్ యూనివర్సిటీ, పీవీ నర్సింహారావు పేరున వెటర్నరీ యూనివర్సిటీ పెట్టామని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మీద హార్టికల్చర్, ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద వ్యవసాయ విశ్వవిద్యాలయం, జగ్జీవన్‌రాం పేరు మీద సిరిసిల్లలో వ్యవసాయ కళాశాల పెట్టినట్లు తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టే అంశంపై తెలంగాణ అసెంబ్లీలో నేడు చర్చ జరిగింది. ఈ అంశంపై మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రానున్న స్పోర్ట్స్ పాలసీని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. దాని కోసం సలహాలు సూచనలు కూడా ఇస్తామని వెల్లడించారు. BRS అధికారంలో ఉండగా.. ప్రతి గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. గ్రామీణ క్రీడా ప్రాంగణాలను బాగు చేసి వాటిని కూడా మెయింటెన్ చేయాలని కేటీఆర్ సూచించారు.
సురవరం ప్రతాప్ రెడ్డి అంటే కేసీఆర్‌కు ఎనలేని గౌరవం ఉందని అన్నారు. ఆయన పేరున తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నట్లు తెలిపారు. పలు కారణాల వల్ల చేయలేకపోయామని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పూర్తి చేస్తే మద్దతిస్తామని కేటీఆర్ అన్నారు. వెంకటస్వామి విగ్రహం పెట్టామని, ఈశ్వరీ భాయ్ జయంతి నిర్వహించామని కేటీఆర్ తెలిపారు.
కాళోజీ పేరు మీద హెల్త్ యూనివర్సిటీ, పీవీ నర్సింహారావు పేరున వెటర్నరీ యూనివర్సిటీ పెట్టామని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మీద హార్టికల్చర్, ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద వ్యవసాయ విశ్వవిద్యాలయం, జగ్జీవన్‌రాం పేరు మీద సిరిసిల్లలో వ్యవసాయ కళాశాల పెట్టినట్లు తెలిపారు.
దేశోద్దారక భవనంలో సురవరం ప్రతాప్ రెడ్డి పేరు మీద రూ. 5 కోట్లతో ఆడిటోరియం బాగుచేయించామని అన్నారు. తెలంగాణలో మహానుభవులను రాజకీయాలకు అతీతంగా గౌరవించుకునే సంస్కృతి ఉందని కాంగ్రెస్ కూడా కూడా కొనసాగించాలని. అందుకు సహకరిస్తామని కేటీఆర్ అన్నారు.