హిమాలయాల్లో ఇప్పటికీ ఎప్పటికీ సజీవంగా జీవించి ఉన్నారని తమ అనుయాయులు విశ్వసించే అసమానమైన గురువు బాబాజీ, విశ్వాసంతో తనను అనుసరించే వారికి ఇప్పటికీ మార్గదర్శనం చేస్తూ, వారిని దీవిస్తూ ఉంటారు
న్యూస్ లైన్ డెస్క్: బాబాజీ పేరును ఎవరు గాఢమైన భక్తితో ఉచ్చరిస్తారో వారు తక్షణ ఆధ్యాత్మిక దీవెన అందుకుంటారు..! సర్వశక్తిమంతమైన ఈ మాటలతో తానే ఒక యోగావతారులైన లాహిరీ మహాశయులు మానవజాతిపై మహావతారులకున్న గొప్ప ప్రభావాన్ని ప్రస్తుతించారు. హిమాలయాల్లో ఇప్పటికీ ఎప్పటికీ సజీవంగా జీవించి ఉన్నారని తమ అనుయాయులు విశ్వసించే అసమానమైన గురువు బాబాజీ, విశ్వాసంతో తనను అనుసరించే వారికి ఇప్పటికీ మార్గదర్శనం చేస్తూ, వారిని దీవిస్తూ ఉంటారు.
బాబాజీ వ్యక్తిత్వాన్ని అత్యంత స్పష్టంగానూ, ప్రామాణికతతోనూ ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా భాషలలో లభ్యమవుతూ, అత్యధిక కాపీలు అమ్ముడు పోతున్న ఆధ్యాత్మిక కావ్యం 'ఒకయోగి ఆత్మకథ'లో వర్ణించారు. పాశ్చాత్య దేశాల్లో యోగశాస్త్ర పితామహుడిగా బహుళ ఖ్యాతి పొందిన పరమహంస యోగానంద రచించిన ఈ గ్రంథంలో భారతదేశానికి చెందిన గొప్ప ఋషుల జీవిత కథలలోని అబ్బురపరిచే ప్రేరణాత్మక అంశాలను ప్రముఖంగా పేర్కొన్నారు. వారందరిలో బాబాజీ సర్వశ్రేష్టులు.
ప్రతి సంవత్సరమూ బాబాజీ స్మృతి దివస్ లేదా జ్ఞాపకం చేసుకొనే రోజు జులై 25న వస్తుంది. ప్రతీ ఏడూ ఈ రోజున, ఇంకా ఏడాది పొడవునా శ్రద్ధాళువులైన భక్తులు హిమాలయాల్లోని ద్వారాహట్ చేరుకొని బాబాజీ గుహను సందర్శిస్తారు. సాటిలేని మహా గురువులైన మహావతార బాబాజీ లాహిరీ మహాశయులకు క్రియయోగ దీక్ష ఇవ్వడం ద్వారా ఇంతకాలమూ మరుగున పడిపోయిన క్రియాయోగ శాస్త్రం తిరిగి ప్రపంచానికి అందించబడినది ఈ స్థలానికి దగ్గరలోనే.
'ఒక యోగి ఆత్మకథ'లోని అనేక పుటలలో బాబాజీ కథలు మనకు కనిపిస్తాయి. పాఠకులు ఆ గొప్ప గురువుల గురించి చదవడంతోనే సంభ్రమానికి గురై, ఉద్ధరించబడిన అనుభూతి పొందుతారు. ఈ ఉద్గ్రంథ పుటలలోంచి మహావతారుల దీవెనలు గ్రహణ శీలుర హృదయాల్లోకి, ఆత్మలలోకి ప్రవహించినట్టు మనకనిపిస్తుంది.
బాబాజీ లాహిరీ మహాశయులకు అందించిన శిక్షణ, ఆనంతరం కాశీలోనూ, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన సత్యాన్వేషకులపై ఆయన చూపిన ప్రభావం ఇవన్నీ ఇప్పుడు చారిత్రక జానపద గాథలయ్యాయి. అయినా బాబాజీ, లాహిరీ మహాశయులు మొత్తం సంఘంపై చూపించిన ప్రభావం.. ఇది భౌతికవాద శక్తులపై నిరంతర తలపడుతూనే ఉంది.. నిజంగా మహత్వపూర్ణమైనది. ఇంకా లాహిరీ మహాశయుల గొప్ప శిష్యులైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరిని అందరూ ప్రేమగా యోగానందుల గురువుగా అని పిలుచుకునే వారు.. వారి ఉత్కృష్ట యోగ వారసత్వాన్ని కొనసాగించారు. శ్రీయుక్తేశ్వర్ గిరి శ్రీరాంపూర్ ఆశ్రమంలో యోగానంద అందుకొన్న కఠినమూ, క్రమశిక్షణాయుతము అయిన శిక్షణ ఆయనను ఈ భూమిపై జీవించిన మహోన్నత ఋషులలో ఒకరుగా నిలబెట్టింది.
మహావతార బాబాజీ శ్రీయుక్తేశ్వర్ గిరికి అప్పటికి అసంభవంగానూ, నమ్మశక్యంగా అనిపించనిదీ అయిన ప్రణాళిక యోగానందగారిని యోగ ధ్యానం గురించిన శాస్త్రీయ జ్ఞానాన్ని పాశ్చాత్యులకు బోధించడానికి నియమించి, అమెరికాకు పంపించబోతున్నామని ముందుగానే చెప్పారు. అయినా ఒక అవతార పురుషుని మాటలు తేలికగా పలికినవి కావు. అలాగే సరిగ్గా బాబాజీ ముందుగానే చెప్పినట్టు శ్రీయుక్తేశ్వర్ చేతిలో రూపుదిద్దుకొంటున్న శిష్యుడు ముకుందలాల్ ఘోష్, తరువాతి దశాబ్దాలలో ప్రపంచమంతటా గుర్తింపు పొందిన గురువు పరమహంస యోగానందగా పరిణతి చెందాడు.
భారతదేశంలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (YSS), ప్రపంచ వ్యాప్తంగా సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (SRF) ద్వారా క్రమమైన పద్ధతిలో వ్యాప్తి చెందించబడుతున్న ఈ నలుగురు ఉత్కృష్ట గురువుల ప్రధాన సందేశం.. ప్రతి వ్యక్తీ కృషి చేసి ఆంతరికంగా పరమాత్మతో తన ఆత్మ యొక్క ఏకత్వాన్ని కనుగొనడం యొక్క అత్యంత ఆవశ్యకత. మానవ జాతి విముక్తికై వీరు ప్రతిపాదించిన ప్రధాన పధ్ధతి.. ఆ సర్వశక్తిమంతునితో ఏకత్వాన్ని సాధించడానికి అత్యున్నత మార్గం, శాస్త్రీయ మైన యోగ ప్రక్రియ క్రియాయోగం.
ఈశ్వర సంయోగానికి కృషి చేస్తామన్న మన ప్రతిజ్ఞను జ్ఞాపకం చేసి, పునరుద్ధరించడానికి, ఒక గొప్ప అవకాశం బాబాజీ స్మృతి దినం.