Friendship day: ఫ్రెండ్‌షిప్ డే ఎందుకు జరుపుకుంటారంటే..?

అమెరికా ప్రభుత్వం 1935 ఆగస్టు మొదటి శనివారం ఓ వ్యక్తిని హతమార్చగా, ఈ మరణ వార్త విని ఆ మర్నాడు అతడి స్నేహితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 


Published Aug 04, 2024 01:42:27 PM
postImages/2024-08-04/1722759147_friends.jpg

న్యూస్ లైన్, స్పషల్: "ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇండీడ్".. అని ఇంగ్లీష్ వాళ్లు అంటుంటారు. అవసరమైన సమయంలో వెన్నంటి ఉండి, నేనున్నానని చెప్పి తోడుగా నిలిచే వాడే నిజమైన స్నేహితుడు అని అర్థం. అలాంటి స్నేహితుడు ఉన్న వ్యక్తి అందరికంటే అదృష్టవంతుడు. ఒక సామెత ఉంది స్నేహితుడి ఆనందంగా ఉన్నప్పుడు పిలిస్తే వెళ్లాలి, కష్టంలో ఉన్నపుడు పిలవకున్నా వెళ్లాలి అని. అలాంటి స్నేహాన్ని పదిలంగా పదికాలలు నిలుపుకున్నవారు అరుదుగా ఉంటారు. ఈ రోజుల్లో వయస్సుతో సంబబంధంగా లేకుండా నిర్లిప్తంగా, ఒంటరి అనే భావనలకు లోనవుతున్నారు. పర్యవసానంగా, ఇది వ్యక్తి ఆందోళన, నిరాశకు కారణమవుతుంది. అతని ఆ భావనను నుంచి బయటికి తీసుకొచ్చే వాడే నిజమైన స్నేహితుడు. ఎందుకంటే అలాంటి స్నేహితుడు జీవితాన్ని అన్ని విషయాల్లో ప్రభావితం చేసే వ్యక్తి. అందుకే అంటారు నీవు ఎవరి స్నేహితుడవో చెప్పు, నీవు ఎలాంటి వాడివో చెప్తా అని పెద్దలు అంటారు.

కష్ట సుఖాలలో అండగా ఉంటూ, నిస్వార్థంగా సాయం అందించే వారు నిజమైన స్నేహితులు. ఈ ప్రపంచంలో నాకేవరూ లేరు, నాకు చుట్టాలు, బంధువులు లేరు అనే వారు ఎక్కడైనా ఉంటారేమోగాని స్నేహితులు లేనివారు ఎవరూ ఉండరనేది అక్షర సత్యం. ఈ సృష్టిలో నిజమైన స్నేహం కంటే విలువైన బహుమానం మరొకటి లేదు. కల్మషం లేని, కమ్మనేనైది స్నేహమొక్కటే. మంచి స్నేహితుల మధ్య ఎలాంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. కష్టంలో కలత చెందిన మనసుకి వెన్నలా చల్లదనాన్ని, ప్రశాంతతను కలిగించే దివ్యౌషధం స్నేహం.

అలాంటి స్నేహానికి ప్రత్యేకంగా ఒక రోజు అవసరమా.. అంటే అవసరమేనంటూ ప్రపంచ వ్యాప్తంగా ఒక రోజును నిర్ణయించుకొని స్నేహితుల దినోత్సవాన్ని వేడుకలా జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ఏటా ఆగస్టు తొలి ఆదివారం జరుపుకుంటారు. ఈ రోజున స్నేహితులపై ఉన్న తమ ప్రేమ వ్యక్తంచేస్తారు. ఈ సందర్భంగా గ్రీటింగ్‌ కార్డ్స్‌, ఫ్రెండిషిప్‌ బ్యాండ్స్‌, బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. అమెరికా ప్రభుత్వం 1935 ఆగస్టు మొదటి శనివారం ఓ వ్యక్తిని హతమార్చగా, ఈ మరణ వార్త విని ఆ మర్నాడు (అంటే ఆదివారం) అతడి స్నేహితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ సంఘటనకు స్పందించిన ఆమెరికా ప్రభుత్వం వీరిద్దరి స్నేహానికి గుర్తుగా అప్పటి నుంచి ఏటా ఆగస్టు తొలి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా ప్రకటించినట్లు చరిత్ర చెబుతుంది. 1935లో యునైటెడ్‌ స్టేట్స్‌ కాంగ్రెస్‌ ఆగస్టు మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజుగా ప్రకటించింది. దీంతో ప్రతి ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకొంటున్నారు.

అమ్మానాన్నలు, సోదరులను దేవుడే నిర్ణయించి మనకు వరంగా ప్రసాదిస్తాడు. కానీ  స్నేహితులను మాత్రం ఎంపికచేసుకునే అవకాశం మనకే ఇచ్చాడు. అమ్మ అనే పదం తర్వాత అంతటి ఆత్మీయతను ధ్వనింపజేసే మాట స్నేహం. స్నేహం ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. మంచి స్నేహాతుడిని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే వారు జీవితాంతం సంతోషంగా ఉంటారు, ఉంచుతారు. మనలా ఆలోచించి, గురువులా బోధించి, తప్పు చేసినప్పుడు మందిలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. సృష్టిలో తీయనైనది కలకాలం నిలిచిపోయేది స్నేహం. అనుబంధాలకు ఆత్మీయతకు చిరునామా.. అనుభూతుల నెలవై.. అనుభవాల కొలువై... వర్ణించడానికి వీలులేని అందమైనది అపురూపమైనది చెలిమి.

పల్లె పట్టణం తేడా లేకుండా, వృత్తి ఏదైనా ప్రవృత్తి అంతరంగంలో అరమరికలు లేకుండా మనషులు వేరైనా మనసులో ఒకటిగా పెనవేసుకునేది చెలిమి. స్నేహానికి కులం.. మతం.. అనే తారతమ్యం లేదు.. స్నేహం పవిత్రమైంది.. నిజమైన స్నేహానికి మించిన ఆస్తులు లేవు. కన్నవారితో, కట్టుకున్న వారితో, తోబుట్టువులతో చెప్పుకొలేని ఎన్నో విషయాలను మిత్రులకు చెప్పుకోవడమంటే స్నేహం ఎంత గొప్పదో అర్థమవుతుంది.

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu telanganam friendshipday

Related Articles