బంగారం ధరలు ప్రధానంగా పెరగడానికి ముఖ్య కారణం పశ్చిమాసియా దేశాల్లో నెలకొని ఉన్న యుద్ధ వాతావరణమే ఒక కారణంగా చెప్తున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోల్చి చూసినట్లయితే బంగారం ధర కొద్దిగా తగ్గింది. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,230 నమోదు కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,790 రూపాయలుగా నమోదు అయ్యింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,790 రూపాయలుగా నమోదు అయ్యింది. బంగారం ధరలు ప్రధానంగా అంతర్జాతీయ కారణాలవల్ల హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. బంగారం ధరలు ప్రధానంగా పెరగడానికి ముఖ్య కారణం పశ్చిమాసియా దేశాల్లో నెలకొని ఉన్న యుద్ధ వాతావరణమే ఒక కారణంగా చెప్తున్నారు.
ప్రస్తుతం దసరా దీపావళి ధన త్రయోదశి ఫెస్టివల్ సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్లో సాధారణంగానే సంవత్సరం మొత్తం తో పోల్చి చూస్తే బంగారు ఆభరణాలు కొనుగోలు ఎక్కువగా ఉంది. దీపావళి నాటికి బంగారం ధర 80,000 రూపాయలు దాటే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ని వల్ల గ్రాము బంగారం 8వేల పైమాటే పలుకుతుంది. ఇదే జరిగితే బంగారం కొనుగోళ్లకు మదీధ్యతరగతి వారు ఇబ్బందులు పడకమానరు.
అయితే అన్ని తెలుగు రాష్ట్రాల్లోను ఇదే ధర 22 క్యారట్ల బంగారం 70,790 కాగా..24 క్యారట్ల బంగారం 77,230 గా నడుస్తుంది. వెండి లక్ష మార్క్ దాటి మధాతధంగా అమ్మకాలు జరుగుతున్నాయి.