sambar: వెడ్డింగ్స్ లో చేసే సాంబార్ ను ఇలా ఇంట్లోనే చేసుకొండి !

సాంబార్ లో ఏ కూరగాయలు వేసుకోవాలని ఆలోచించకండి..కాకరకాయ తప్ప ఏం వేసుకున్నా ..అధ్భుతంగా ఉంటుంది.  సో చేసేద్దాంరండి.


Published Oct 04, 2024 03:39:07 AM
postImages/2024-10-04/1728028885_thumb700000auto.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ :  చాలామందికి పెళ్లిళ్లలో చేసే సాంబర్ అంటే భలే ఇష్టం . కాని మనకు చెయ్యడం రాదు..వాళ్లేం చేస్తారో తెలీదు. జస్ట్ ఓ సారి ఓ పెద్దావిడ సాంబర్ చాలా ఫేమస్ అయ్యిందట. అదే ఈ పెళ్లి సాంబార్..అసలు పెళ్లి సాంబార్ ఏం చేస్తే అంత ఫేమసో..చూసేద్దాం రండి.
కావాల్సిన పదార్థాలు :


కంది పప్పు - కప్పు
క్యారెట్​ ముక్కలు - కప్పు
మునగకాయ ముక్కలు - కప్పు
సొరకాయ ముక్కలు-కప్పు
వంకాయలు - 3
పచ్చిమిర్చి - 5
నూనె
ఉప్పు - రుచికి సరిపడా
చింతపండు- 50 గ్రాములు
ఎండు మిరపకాయలు -2
జీలకర్ర - టేబుల్​స్పూన్
బెండకాయలు-3
టమాటాలు-2
ఉల్లిపాయలు-2
పసుపు- టీ స్పూన్​
కారం-2టేబుల్​స్పూన్లు
సాంబార్​ పౌడర్​-టేబుల్​స్పూన్
గరం మసాలా-టేబుల్​స్పూన్
కొత్తిమీర - కొద్దిగా
నీరు సరిపడా
ఆవాలు - టీ స్పూన్​
జీలకర్ర - టీ స్పూన్​
వెల్లుల్లి రెబ్బలు-5
కరివేపాకు -2 రెమ్మలు


తయారీ విధానం..
ముందుగా కూరగాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్​ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే చింతపండుని నీటిలో నానబెట్టుకోవాలి. సాంబార్ లో ఏ కూరగాయలు వేసుకోవాలని ఆలోచించకండి..కాకరకాయ తప్ప ఏం వేసుకున్నా ..అధ్భుతంగా ఉంటుంది.  సో చేసేద్దాంరండి.


ముందుగా కందిపప్పును బాగా ఉడికించండి. అందులో కాస్త నూనె వేస్తే మరింత మెత్తగా అవుతుంది. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు వేయాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి వేసి కలపాలి.

కూరగాయలు మొదటి చిన్న ఉప్పు వేసి ...విడి ఉడికించుకొండి. ఇలా చేస్తే ముక్కలు బాగా ఉడికి సాంబార్ లో బాగుంటుంది. పప్పు లో కాసింత చింతపండు పులుపు వెయ్యండి.  ఇందులో కాసింత ఉప్పు కారం, కరివేపాకు, కొత్తిమీర వేసి చిన్న మంట మీద సాంబార్​ 15 నిమిషాలు మరిగించుకోవాలి. దించేసే ముందు సాంబార్ పొడి వేసుకొని ఇంగువ తో పోపు పెట్టుకుంటే అధ్భుతహః
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu marraige food, tasty-food-

Related Articles