ఈరోజు దుర్గాదేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. మొత్తం తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తల్లిని నియమ నిష్ఠలతో పూజిస్తూ పండగలగా జరుపుకుంటారు. అలా దుర్గాదేవి తొమ్మిది రోజులు, తొమ్మిది అవతారాల్లో
న్యూస్ లైన్ డెస్క్: ఈరోజు దుర్గాదేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. మొత్తం తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తల్లిని నియమ నిష్ఠలతో పూజిస్తూ పండగలగా జరుపుకుంటారు. అలా దుర్గాదేవి తొమ్మిది రోజులు, తొమ్మిది అవతారాల్లో మనకు దర్శనమిస్తుంది. ఈ తొమ్మిది రాత్రులు అమ్మవారిని భక్తితో ఆరాధిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా నవరాత్రులు మనిషి యొక్క పూర్ణత్వాన్ని ప్రసాదిస్తాయట. ఈ టైంలో దేవీ భాగవతం చదవడం కానీ వినడం కానీ చేయాలట.
అలాంటి దుర్గాదేవి అమ్మవారిని తొమ్మిది రోజులపాటు 9 అవతారాలలో పూజించి తొమ్మిది రకాల పిండి వంటలు పెట్టి పూజలు చేస్తే ఇంట్లో అన్ని శుభ ఫలితాలే ఉంటాయని పండితులు అంటున్నారు. మరి దుర్గాదేవి అవతారాల్లో మొదటి రోజు దర్శనమిచ్చే అవతారం శైలపుత్రి దేవి. అంటే శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా పసుపు రంగు వస్త్రాలు, పువ్వులతో మనకు దర్శనమిస్తుందట.
ఈ మొదటిరోజు దుర్గాదేవి అమ్మవారిని పూజ చేస్తూ నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే అన్ని శుభాలే కలుగుతాయట. నెయ్యి కాకుండా కట్టెపొంగలి నైవేద్యంగా సమర్పిస్తే అనుకున్నది నెరవేరుతుందని పండితులు తెలియజేస్తున్నారు.