IIIT Basara: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన

బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.


Published Sep 05, 2024 09:48:53 AM
postImages/2024-09-05/1725509933_iiitbasara.PNG

న్యూస్ లైన్ డెస్క్: బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. రెగ్యులర్ వీసీ నియామకం, హాస్టల్ గదుల్లో, మెస్సుల్లో, విద్యాబోధనలో ఎదుర్కొంటున్న సమస్యలపై 2 వేల మంది విద్యార్థులు గురువారం భారీ ర్యాలీ తీశారు. రెగ్యులర్ వీసీని నియమించాలని, ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే శాంతి యుతంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర ట్రిపుల్ ఐటీ వచ్చి సమస్యలు పరిశీలించాలని కోరుకుంటున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలు ఎక్కడివక్కడే అన్నట్లుగా ఉన్నాయని విద్యార్థులు మండిపడుతున్నారు. కనీస వసతులు కరువయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు. ప్రభుత్వం రెగ్యులర్‌గా బాసర ట్రిపుల్ ఐటీకి నిధుల విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

newsline-whatsapp-channel
Tags : telangana students hyderabad congress cm-revanth-reddy

Related Articles