Jobs:పంచాయతీ రాజ్ లో ఉద్యోగాలు..ఎగ్జామ్ లేకుండానే.!

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ శాఖలో ప్రాజెక్టు అసోసియేట్, ట్రైనింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీ కోసం కాంట్రాక్టు పద్ధతిలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే


Published Sep 17, 2024 11:38:23 AM
postImages/2024-09-17/1726553303_job.jpg

న్యూస్ లైన్ డెస్క్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ శాఖలో ప్రాజెక్టు అసోసియేట్, ట్రైనింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీ కోసం కాంట్రాక్టు పద్ధతిలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ మార్కులు ఆధారంగానే  ఎంపిక చేసి పంచాయతీరాజ్ శాఖల ఉద్యోగాలు అందిస్తారు.  మరియు ఉద్యోగానికి క్వాలిఫికేషన్స్ ఇతర వివరాలు ఏంటో చూద్దాం. 

 ఉద్యోగాలు :
 ప్రాజెక్టు అసోసియేట్, ట్రైనింగ్ అసోసియేట్,  ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ సోషల్ సైన్స్ లో రూరల్ డెవలప్మెంట్ రూరల్ మేనేజ్మెంట్  విభాగాలు పనిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా పీహెచ్ డీ, పూర్తి చేసిన ఈ ఉద్యోగాలకు అర్హులే. 

 జీతభత్యాలు:
కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకునే ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకి 60,000 జీతం అందిస్తారు. ఒక ఏడాది పాటు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయవలసి ఉంటుంది.

 దరఖాస్తు విధానం:
 అర్హత కలిగినటువంటి అభ్యర్థులు సెప్టెంబర్ 18, 2024లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి అర్హులు.

 ఫీజు వివరాలు:
 ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు ఓబిసి, ఈ డబ్ల్యూ ఎస్, యుఆర్  అభ్యర్థులు 300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఇలాంటి ఫీజు లేదు.

 అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి రాత పరీక్ష స్కిల్ టెస్ట్ లు ఏమీ ఉండవు కానీ ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu comptetive-exams panchayat-raj department

Related Articles