JaniMaster: జానీమాస్టర్ అంత డేంజరా..90మందిపై అలా.?

టాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న విషయం మనందరికీ తెలిసిందే.  ఆయన దగ్గర పనిచేసే ఒక అమ్మాయి దగ్గర అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆమెను ఇష్టం  వచ్చినట్టు చేశాడని  


Published Sep 19, 2024 11:57:00 AM
postImages/2024-09-19/1726723610_janimastershreshta.jpg

న్యూస్ లైన్ డెస్క్: టాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న విషయం మనందరికీ తెలిసిందే.  ఆయన దగ్గర పనిచేసే ఒక అమ్మాయి దగ్గర అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆమెను ఇష్టం  వచ్చినట్టు చేశాడని  ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం కాస్త  చర్చనీయాంశంగా మారింది. దీంతో జానీ మాస్టర్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆయన ఎక్కడో తలదాచుకొని వారికి దొరకడం లేదు. అయితే జానీ మాస్టర్ ఆ అమ్మాయి 17 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఆమెపై అఘాయిత్యం చేస్తూ వస్తున్నాడట. దీంతో ఆ అమ్మాయి ఎదురు తిరిగి, నాపై ఇలా చేశాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం   కింద కేసు నమోదు అయింది. ఇది ఇలా ఉండగానే జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి అనేక దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆయన తన తోటి కొరియోగ్రాఫర్లను విపరీతంగా ఇబ్బందులకు గురి చేసినట్లు కూడా తెలుస్తోంది.

అయితే ఆయన తెలుగు ఇండస్ట్రీలోని ఫిల్మ్, టీవీ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్  ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత, తన తోటి కొరియోగ్రాఫర్లను విపరీతంగా వేధింపులకు గురి చేశారట. వారి యొక్క కార్యవర్గం చేసినటువంటి నిర్ణయాలను కూడా లెక్కచేయకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ వస్తున్నారట. అంతేకాదు కొత్తగా ఆడిషన్స్ లో సెలెక్ట్ అయిన వారికి సభ్యత్వాలు ఇవ్వకుండా 90 మందిని జానీ మాస్టర్ విపరీతంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని  తెలుస్తోంది.

రాజకీయ పలుకుబడి ఉండడంతో ఈ విధంగా అరాచకాలకు పాల్పడ్డారని కొరియోగ్రాఫర్లు చాలామంది బయటకు రావడానికి భయపడ్డారట. అయితే జానీ మాస్టర్ వివాదం బయటకు రావడంతో జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఈయన వల్ల ఇబ్బందులు పడ్డటువంటి 90 మంది వ్యక్తులు బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారట. ఈ విధంగా జానీ మాస్టర్ ఒక్కొక్క అరాచక  పనులు బయటకు రావడంతో  ఈయన ఇంత డేంజరా అంటూ చాలామంది  కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : janasena newslinetelugu pawan-kalyan tollywood narsingi-police-station johnmaster

Related Articles