Mokshagna: నందమూరి హీరోనా మజాకా..ఫస్ట్ మూవీకే కళ్ళు చెదిరే బడ్జెట్.!

నందమూరి మూడవ తరం హీరోలలో  ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అంటే తెలియని వారు ఉండరు. వీరిద్దరు తెలుగు ఇండస్ట్రీలో స్టార్లు అయ్యారు. ఇదే తరానికి చెందినటువంటి మరో హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ ముద్దుల 


Published Sep 19, 2024 10:13:09 AM
postImages/2024-09-19/1726720989_mokshagna.jpg

న్యూస్ లైన్ డెస్క్: నందమూరి మూడవ తరం హీరోలలో  ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అంటే తెలియని వారు ఉండరు. వీరిద్దరు తెలుగు ఇండస్ట్రీలో స్టార్లు అయ్యారు. ఇదే తరానికి చెందినటువంటి మరో హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ ముద్దుల కొడుకు  మోక్షజ్ఞ త్వరలో ఇండస్ట్రీలోకి  హీరోగా అరంగేట్రం చేయబోతున్నారు. ఈయన కోసం తండ్రి బాలకృష్ణ  అతిరథ మహారాజులైనటువంటి  డైరెక్టర్లను కలిసి కథను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

మొదటి సినిమాతోనే మోక్షజ్ఞ   ప్రేక్షకులు ఆదరణ పొందాలని అద్భుతమైన కథాంశంతో పరిచయం చేయాలని బాలకృష్ణ అన్ని సిద్ధం చేశారట. ఇప్పటికే ఆయన బర్త్డే సందర్భంగా సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. అయితే ఈయన ప్రశాంత్ వర్మ పివిసివి నుంచి  మొదటిసారి హీరోగా లాంచ్ అవ్వబోతున్నాడు.

ఈ చిత్రానికి తన అక్క నందమూరి తేజస్విని, సుధాకర్ చెరుకూరి  నిర్మాతలుగా వ్యవహరించి భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తారట. మొదటి చిత్రమే పాన్ ఇండియా లెవెల్ లో  100 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నారని వార్త వినిపిస్తోంది. ఇక డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా  అద్భుతమైన స్క్రిప్ట్ తో పక్కా ప్లానింగ్స్ ప్రకారం సెట్స్ మీదికి వెళ్లేందుకు సిద్ధమవుతుందట.

దసరా పండుగను పురస్కరించుకొని సినిమాను పూజా కార్యక్రమాలతో పెద్ద ఎత్తున ప్రారంభించడానికి ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.  అయితే ఈ సినిమా ఓపెనింగ్స్ కి ఇండస్ట్రీ నుంచి ఎంతో పేరుగాంచిన నటీనటులు హాజరవుతారట. ఈ విధంగా నందమూరి హీరో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు అంటే ఆయన అభిమానులకు పట్టరాని ఆనందం కలుగుతుందట.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu balakrishna mokshagna prashanth-varma tejaswini mokshagna-movie-poster

Related Articles