Breaking: జానీ మాస్టర్ అరెస్ట్.. ఎక్కడంటే.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఎంతో పేరు తెచ్చుకున్నారు జానీ మాస్టర్. ఆయన కెరియర్ మంచి పొజిషన్ లో కొనసాగుతున్న తరుణంలో  లైంగిక ఆరోపణల కేసులో ఇరుక్కున్నాడు. జానీ మాస్టర్


Published Sep 19, 2024 11:16:26 AM
postImages/2024-09-19/1726724786_janimasterarest.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఎంతో పేరు తెచ్చుకున్నారు జానీ మాస్టర్. ఆయన కెరియర్ మంచి పొజిషన్ లో కొనసాగుతున్న తరుణంలో  లైంగిక ఆరోపణల కేసులో ఇరుక్కున్నాడు. జానీ మాస్టర్ తనకింద అసిస్టెంట్ గా చేసే ఒక అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నారని ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

దీంతో జానీ మాస్టర్ పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అరెస్టు చేయడానికి పలు బృందాలుగా ఏర్పడ్డారు. జానీ జానీ మాస్టర్ కేసు పెట్టినప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతూ వస్తున్నాడు.  దీంతో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు పెట్టినటువంటి బాధితురాలికి భద్రత కూడా కల్పించారు.

 ఇదే తరుణంలో జానీ మాస్టారును తాజాగా సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా జానీ మాస్టర్ పట్టు పడడంతో  ఆయనకు తగిన శిక్ష పడాలని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu jani-master jani-master-arrest bengalore sot-police

Related Articles