RRB 2024 : రైల్వేలో 14 వేల టెక్నీషియన్ పోస్టులు ..నిరుద్యోగులకు బెస్ట్ ఆఫ్షన్

భారతీయ రైల్వే శాఖ నుంచి రీసెంట్ గా భారీ సంఖ్యలో జాబ్స్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నారు.


Published Aug 23, 2024 05:25:00 PM
postImages/2024-08-23/1724414235_Railwayjobs2023.jpeg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: భారతీయ రైల్వే శాఖ నుంచి రీసెంట్ గా భారీ సంఖ్యలో జాబ్స్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నారు. లోకో పైలట్స్ , అసిస్టెంట్స్ లోకో పైలట్స్ పోస్టులు , అప్రెంటిస్ పోస్టులు , టెక్నీషియన్ పోస్టులను భారీ సంఖ్యలో భర్తీ చేస్తున్నారు. 298 పోస్టులను భర్తీ చేయనున్నది రైల్వే శాఖ. చాలా రోజుల తర్వాత రైల్వేశాఖ భారీ ఉద్యోగాలు భర్తీ చేసిందనే చెప్పాలి.


ఆర్ఆర్బీ జోన్ల వారీగా 14,298 టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. ఇందులో సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో 959 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు టెన్త్ తో పాటు ఖచ్చితంగా ఐటీఐ చేసి ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించి కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 ప్రారంభ వేతనం ఉంటుంది. 


ఈ పోస్టులకు సంబంధించి మరింత సమాచారం కోసం రైల్వే అధికారిక యాప్ లోకి వెళ్తే మీకు సరైన సమాచారం తెలుస్తుంది. అక్టోబర్‌/ నవంబర్‌లో రాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం అఫిషియల్ రైల్వే వెబ్ సైట్ చెక్ చెయ్యాల్సిందే.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu railway-department jobs

Related Articles