Jobs:10th పాసయ్యారా..39,481 ఉద్యోగాలు.!

పదవ తరగతి చదివి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు. కేవలం 10th క్వాలిఫికేషన్ తోనే కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాన్ని సాధించవచ్చు. మరి ఆ ఉద్యోగం


Published Sep 12, 2024 02:41:42 PM
postImages/2024-09-12/1726132302_job.jpg

న్యూస్ లైన్ డెస్క్: పదవ తరగతి చదివి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు. కేవలం 10th క్వాలిఫికేషన్ తోనే కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాన్ని సాధించవచ్చు. మరి ఆ ఉద్యోగం ఏంటి వివరాలు ఏంటో చూద్దాం..  కేంద్ర సర్కార్ భద్రతా బలగాల్లో భాగంగా 39,481 కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. ఇందులో మొత్తం బిఎస్ఎఫ్ లో  15,654, సిఐఎస్ఎఫ్ లో 7145, ఎస్ఎస్ బిలో  819, సిఆర్పిఎఫ్ లో  11,541, ఐటిబిపిలో 3,017, అస్సాం రైఫిల్స్ లో  1248, నార్కోటెక్స్ కంట్రోల్ బ్యూరోలో  22, ఎస్ఎస్ఎఫ్ లో 35 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం ఉద్యోగాల్లో మహిళలకు 3869 ఉద్యోగాలు ఉన్నాయి.

 దరఖాస్తు రుసుము:
 వంద రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, మహిళలు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

 వయస్సు:
ఈ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థుల వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.రిజర్వేషన్ ను బట్టి కాస్త సడలింపు ఉంటుంది.

 ఎగ్జామ్ విధానం:
 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది. 

 పరీక్ష:
 వచ్చే సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 160 మార్కులకు గాను సిబిటి విధానంలో ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇక ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, హిందీ, ఇంగ్లీష్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు, నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. 

 చివరి తేదీ :అక్టోబర్ 14 వరకు.

newsline-whatsapp-channel
Tags : news-line central-government 10th-class police jobs conistable

Related Articles