VEGIEES: పండ్లను, కూరగాయలను కడగకుండా తింటే ఏమౌతుందో తెలుసా?

ఈ పురుగుమందులు కూరగాయలు, పండ్లపై అలాగే ఉంటాయి. మీరు నీరుతో కడిగితే పోవు అవి. కచ్చితంగా వెనిగర్ తో కడగాల్సిందే.


Published Sep 21, 2024 01:49:00 PM
postImages/2024-09-21/1726906792_download.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చాలా మందికి కూరగాయలు కాని పండ్లు కాని బాగా కడిగే  అలవాటుండదు. ఏదో పేరుకు కడిగామా అన్నట్లు కడుగుతుంటారు. అయితే వెనిగర్ వేసి కడగకపోతే ఎన్ని ఇబ్బందులు పడలో తెలుసా ?


*పురుగుమందులు: కూరగాయలకు, పండ్లకు రకరకాల పురుగు మందులను పిచికారి చేస్తుంటారు. ఈ పురుగుమందులు కూరగాయలు, పండ్లపై అలాగే ఉంటాయి. మీరు నీరుతో కడిగితే పోవు అవి. కచ్చితంగా వెనిగర్ తో కడగాల్సిందే.


* పిల్లల్లో హార్మోన్ల అసమతుల్యత: పురుగుమందులతో కలుషితమైన పండ్లను, కూరగాయలను తింటే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇదే బీపీ , షుగర్లు మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కు కారణమవుతుంది.


* అలెర్జీ: పండ్లు, కూరగాయలపై ఉండే పురుగుమందులు కంటి, చర్మపు చికాకును కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా వరకు ఈసమస్యలు కూరగాయలకు చల్లే ఫెర్టిలైజర్స్ వల్లే వస్తుంది. 


* ఇన్ ఫెర్టిలిటీ:  పిల్లలు పుట్టకుండా చేస్తుంది. గర్భిణిగా ఉన్నపుడు ఈ ఫుడ్ తింటే గర్భస్రావం అవ్వొచ్చు. కాబట్టి కంపల్సరీ సరిగ్గా కడిగి తీరాల్సిందే.


మానసిక ఆరోగ్య సమస్యలు: క్రిమిసంహారక మందులున్న పండ్లను, కూరగాయలను కడగకుండా తింటే పిల్లల్లో ఏకాగ్రత లోపిస్తుంది. 


ఎలా కడగాలంటే ...వెనిగర్ లేనివాళ్లు కాస్త గోరువెచ్చని నీట్లో 15 నిమిషాలు .  దీన్ని 15 నిమిషాల పాటు ఉడకబెట్టి. తర్వాత పండ్లు, కూరగాయలను కడగాలి. ఫలితంగా పండ్లు, కూరగాయల నుంచి 98 శాతం పురుగుమందులు తొలగిపోతాయి.  చాలా వరకు ఇలా చేస్తే ప్రమాదాల నుంచి బయటపడవచ్చు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu healthy-food-habits

Related Articles