Bunny: బన్నీపై పగను పవన్ ఏ విధంగా తీర్చుకుంటున్నారో చూడండి.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిజంగానే బన్నీ పై పగ పట్టారా.. ఆ పగతోనే ఈ పని చేస్తున్నారా అనేది ఇప్పుడు చూద్దాం.. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీలో పేరున్న బడా ఫ్యామిలీలు.. వీరిద్దరికీ ఇండస్ట్రీలో మంచి నేమ్ ఫేమ్


Published Sep 21, 2024 04:10:00 PM
postImages/2024-09-21/1726912580_pawanalluarjun.jpg

న్యూస్ లైన్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిజంగానే బన్నీ పై పగ పట్టారా.. ఆ పగతోనే ఈ పని చేస్తున్నారా అనేది ఇప్పుడు చూద్దాం.. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీలో పేరున్న బడా ఫ్యామిలీలు.. వీరిద్దరికీ ఇండస్ట్రీలో మంచి నేమ్ ఫేమ్ ఉంది.. అయితే అలాంటి ఈ బంధువుల మధ్య గత కొద్ది రోజులుగా కోల్డ్ వార్ జరుగుతుంది.

ప్రత్యక్షంగా బయటపడనప్పటికీ పరోక్షంగా ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటూ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.అయితే అలాంటి వీరి మధ్య వార్ కి ఇది మరో ఉదాహరణ అంటున్నారు ఈ విషయం తెలిసిన కొంతమంది నెటిజన్స్.. మరి ఇంతకీ అదేంటయ్యా అంటే.. తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న దేవర సినిమాకి ఏపీ లో టికెట్ రేట్లు పెంచేసారు కూటమి ప్రభుత్వం..

అయితే ఏపీలో సినిమాటోగ్రఫీ మంత్రి గా జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ తరఫున దేవరకి ఫుల్ సపోర్ట్ వచ్చింది. అయితే ఇందులో మరో కోణం ఉంది అంటున్నారు కొంతమంది జనాలు. అదేంటంటే..పవన్ కళ్యాణ్ ఎలాగైనా సరే ఎన్టీఆర్ దేవర సినిమాతో బన్నీ హీరోగా చేసిన పుష్ప సినిమా రికార్డులను బద్దలు కొట్టించాలి అనే ఉద్దేశంతోనే ఈ విధంగా ఎన్టీఆర్ కి సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మీద పగ ఈ విధంగా తీర్చుకోవడంతో చాలామంది నెటిజన్స్ సెలబ్రిటీల మధ్య చిన్న గొడవ ఎక్కడికైనా దారి తీయవచ్చు. అది ఎందాకైనా వెళ్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు

newsline-whatsapp-channel
Tags : janasena news-line pawan-kalyan jr-ntr allu-arjun pushpa devara

Related Articles