AGED PEOPLE: ముసలైనా...రిటైరైనా ఆ దేశంలో పనిచెయ్యాల్సిందే తప్పదు !

ప్రశాతంగా బతకడానికి ఎన్నో ప్లాన్లు కూడా వేసుకుంటాం. అయితే సింగపూర్ లో రిటైర్మెంట్ తో పని లేకుండా బతికి ఉన్నవాళ్లంతా పనిచెయ్యాల్సిందే. వృధ్ధులకు విశ్రాంతి ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది.


Published Sep 10, 2024 08:44:29 AM
postImages/2024-09-10/1725975692_elderlypeoplegathertoplayacheckersgamenexttotheirhousingareainsingaporeafproslanrahman5500740.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రపంచంలోని ప్రతి దేశంలోను ఎదోక సమస్య వస్తూనే ఉంటుంది. కొన్ని దేశాలు ఆర్ధికంగా ఇబ్బందులు పడితే ..మరో దేశం పేదరికం, వృధ్ధాప్యం, వనరులు తగ్గిపోవడం ఒక్కటి కాదు ఇలా ప్రతి దేశంలోను ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఏ దేశంలో అయినా రిటైర్మెంట్ అనగానే రిలాక్సేషన్ మూడ్ ఉంటాం. ఇక 60 దాటితే ఏ ఉద్యోగం చెయ్యకుండా రిలాక్స్ అవుతుంటాం. ప్రశాతంగా బతకడానికి ఎన్నో ప్లాన్లు కూడా వేసుకుంటాం. అయితే సింగపూర్ లో రిటైర్మెంట్ తో పని లేకుండా బతికి ఉన్నవాళ్లంతా పనిచెయ్యాల్సిందే. వృధ్ధులకు విశ్రాంతి ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది.


సింగపూర్‌లో ప్రజల ఆయుర్దాయం పెరగడంతో పాటు అక్కడి వారు తక్కువ మంది పిల్లలను కంటున్నారు. యువ శ్రామిక శక్తి తగ్గిపోతుంటే, మరోవైపు రిటైరైనవారి  సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. అంతేకాదు దాదాపు 5 గురు సిటిజన్స్ ను తీసుకుంటే అందులో ఒకరు కంపల్సరీ ముసలివారు ఉంటున్నారు.  దీని వల్ల యువశక్తి తగ్గి వృధ్ధులు ఎక్కువైపోతున్నారు.ఈ విచిత్ర సమస్య గురించి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ కు చెందిన ఎకానమిస్ట్ షూలీ చాలా సర్వేలు జరిపి చెబుతున్నారు.


2026 నాటి  సింగపూర్ అత్యధిక వృద్ధులు కలిగిన  దేశంగా మారబోతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రాబోయే ఆర్ధిక సంక్షోభాన్ని గుర్తించి సింగపూర్ ఈ నిర్ణయం తీసుకుంది.   వృద్ధులు ప్రభుత్వానికి మోయలేని భారం అవుతారని తెలిపింది. అలానే వృద్ధాప్యంలో పని చేయడం అనేది చాలా సమస్యలను పరిష్కరిస్తుంది. అందుకే తమకు తోచిన పని ...ఖాళీగా లేకుండా ఏదోక పని చెయ్యమని కోరుతుంది. ఎవ్వరైనా, ఏ కంపెనీ అయినా సరే యువతి, యువకులనే పనిలో పెట్టుకోవాలని భావిస్తుంటారు. తమకు ఉద్యోగాలు దొరకడం లేదని అంటున్నారు వృధ్ధులు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu singapore elder-people retairment

Related Articles