TULASI TEA: వర్షాకాలం తాగాల్సిన ముఖ్యమైన టీ ..టేస్టీ టేస్టీ టీ!

మరీ ముఖ్యంగా వర్షాకాలంలో ఈ తులసి టీని తాగితే కలిగే లాభాలేంటంటే.. తులసీ టీ తో పాటు అల్లం టీ కూడా చాలా మంచిది.


Published Sep 08, 2024 04:45:00 PM
postImages/2024-09-08/1725794176_HolyBasilTeaTulsiTea.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సీజన్ మారింది. ఎటు చూసిన వర్షాలు , వరదలు..వాతావరణంలో మార్పులు దారుణంగా ఉన్నాయి. సరైన ఫుడ్ తీసుకోకపోతే మంచం పట్టేస్తాం.కొన్ని ఫుడ్స్ ఎక్కువ గా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ లభిస్తుంది. రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాం.తులసి టీ.. ఆరోగ్యానికి చాలా మంచిది. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో ఈ తులసి టీని తాగితే కలిగే లాభాలేంటంటే.. తులసీ టీ తో పాటు అల్లం టీ కూడా చాలా మంచిది.


వానాకాలం సరైన ఎండ రాక ...బ్యాక్టీరియా చాలా ఎక్కువవుతుంది. అలర్జీలు పెరుగుతాయి. దీని వల్ల వ్యాధులు పెరుగుతాయి. అంటువ్యాధులు పెరుగుతాయి. దోమలు పెరిగి డయేరియా , మలేరియా లాంటి రోగాలు చాలా ఎక్కువగా ప్రబలుతాయి. తులసీ , అల్లం టీ లు బాడీ హెడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్‌ని దూరం చేసుకోవచ్చు.


వర్షాకాలంలో చాలా మంది అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలతో బాధపడతారు. ఎండ ఉండదు...వర్షానికి బయటకు వెళ్లబుధ్ది కాదు. తిన్నది కదలకుండా పొట్టలో ఎక్కువ సేపు ఉంటుంది.అలాంటి వారు తులసి టీ తాగితే అందులోని కార్మినేటివ్ లక్షణాలు జీర్ణవ్యవస్థని రిలాక్స్ చేస్తాయి. దీంతో గట్ హెల్త్ బాగుంటుంది. గ్యాస్ట్రిక్, ఉబ్బరం, అజీర్ణ సమస్యలు తగ్గుతాయి.


ఒత్తిడి  తగగడం..


ఈ సీజన్‌లో తేమ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఒత్తిడి పెరుగుతుంది. తులసి టీలో అడాప్టోజెన్ అనే గుణం ఉంటుంది. ఈ తులసీ టీ వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆ ఒక్క రీజన్ చాలు తులసీ తాగడానికి .


శ్వాస సమస్యలు..


తులసిలో ముఖ్యమైన నూనెలు ఎక్స్‌పెక్టరెంట్, డీకాంగెస్టెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి సీజన్ చేంజ్ వల్ల వచ్చే జలుబు, దగ్గు, సైనస్ వంటి సమస్యలు, శ్వాస కోసశ సమస్యల నుండి రిలాక్స్ అవ్వొచ్చు. డస్ట్ అలర్జీలు..లాంటివి ఈ తులసీ తగ్గించగలదని ఆయుర్వేదం చెబుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండవు కాబట్టి ప్రయత్నించవచ్చు.
 

newsline-whatsapp-channel
Tags : rains health mental-illness. allergy lungs

Related Articles