అబద్దాల కోరు కాంగ్రెస్..కవితనన్నారు..కేజ్రీవాల్ ను అనరే.?

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నానా యాగి చేస్తున్న కాంగ్రెస్ కు పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టయ్యిందట. ఈ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ రావడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు డైలామాలో పడ్డారట. ఇప్పుడు


Published Sep 18, 2024 09:58:56 AM
postImages/2024-09-18/1726633736_aravind.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నానా యాగి చేస్తున్న కాంగ్రెస్ కు పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టయ్యిందట. ఈ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ రావడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు డైలామాలో పడ్డారట. ఇప్పుడు బీఆర్ఎస్ ను ఏమని విమర్శించాలి.? ఎలా ఆరోపణలు చేయాలని తలపట్టుకుంటున్నారట. కేజ్రీవాల్ కు బెయిల్ రావడంతో ముందరి కాళ్లకు బంధం వేసినట్టే అయ్యిందని కొందరు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకుంటున్నారు.
ఇదే లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కొద్దిరోజుల క్రితమే బెయిల్ వచ్చింది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును తప్పుపడుతూ మాట్లాడారు.

ఇక సోషల్ మీడియాలో రాతలకైతే అడ్డూ అదుపులేదు. కవితకు బెయిల్ వచ్చిందా..? తెచ్చుకున్నారా..? అని.. అలాగే.. మోడీనే దగ్గరుండి కవితకు బెయిల్ ఇప్పించారన్నట్టుగా పోస్టర్లు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెట్టారు. బీజేపీ నేతల కాళ్లు పట్టుకుంటేనే బెయిల్ వచ్చిందని నానా హంగామా సృష్టించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత కూడా అదే ప్రచారం కొనసాగించింది కాంగ్రెస్. 
 కానీ కాంగ్రెస్ కీలకంగా ఉన్న ఇండియా కూటమిలో ఆమ్ పార్టీ కూడా భాగస్వామిగా ఉంది. ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ కేసులో చాలా ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు. ఆయనకే ఇప్పుడు బెయిల్ వచ్చింది.

దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ టార్గెట్ గా ఏ ఆరోపణలు చేసినా.. కేజ్రీవాల్ ను కూడా అన్నట్టే అవుతుంది. తమ కూటమిలో ఉన్న వ్యక్తిని తామే తిడితే ఎలా అని పరేషాన్ అవుతున్నారట. బెయిల్ వచ్చింది అంటే కవితకు కూడా బెయిల్ వచ్చింది అని ఒప్పుకోవాల్సిందే. ఒకవేళ బెయిల్ తెచ్చుకున్నారంటే.. కేజ్రీవాల్ కూడా బీజేపీ కాళ్లు పట్టుకుని బెయిల్ తెచ్చుకున్నారని.. ఒప్పుకోవాల్సి వస్తుంది. దీంతో కాంగ్రెస్ నేతలంతా తలపట్టుకుంటున్నారట.  కాంగ్రెస్ నేతలు మొన్నటి వరకు చేసిన కామెంట్స్ పైనా జనం సైతం ఆలోచనలో పడ్డారట. లిక్కర్ స్కాం కేసులో కవిత దోషి అయితే కేజ్రీవాల్ కూడా దోషినే కదా అన్న చర్చ నడుస్తోందట. కానీ కేజ్రీవాల్ ను కాంగ్రెస్ నిర్ధోషి అని, కవిత మాత్రమే దోషి అని చెప్పడం ఏంటని మాట్లాడుకుంటున్నారట. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగానే తయారైందంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : kcr newslinetelugu brs congress kavitha delhi-liquer-scam kejriwal-

Related Articles