సివిల్ సప్లైస్ శాఖకు చెందిన దాదాపు రూ. 1,100 కోట్ల ప్రభుత్వ సొమ్ము అక్రమార్కుల పాలైందని బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. బిడ్డర్ల కాలపరిమితి పొడిగించడం ప్రభుత్వమే అక్రమాలకు లైసెన్స్ ఇచ్చినట్లు అవుతుందని పెద్ది సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.
న్యూస్ లైన్ డెస్క్: సివిల్ సప్లైస్ శాఖలో అవకతవకలు జరిగాయంటూ వేసిన పిల్‌పై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సివిల్ సప్లైస్ శాఖకు చెందిన దాదాపు రూ. 1,100 కోట్ల ప్రభుత్వ సొమ్ము అక్రమార్కుల పాలైందని బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. బిడ్డర్ల కాలపరిమితి పొడిగించడం ప్రభుత్వమే అక్రమాలకు లైసెన్స్ ఇచ్చినట్లు అవుతుందని పెద్ది సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.
సుదర్శన్ రెడ్డి వేసిన పిల్ ను హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ధర్మాసనం పరిశీలించింది. దీనిపై విచారణ జరిగిన న్యాయస్థానం.. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ అదికారులకు ఆదేశాలు జారీ చేసింది.