telangana: HCU భూములపై హైకోర్టు స్టే ...ఆ ఫొటోగ్రాఫర్ ను పట్టిస్తే 10లక్షల రివార్డు!

అక్కడున్న జింకలు, నెమళ్లు భయంతో పరుగులు తీస్తున్నాయి. నిజానికి ఆ ఫోటోల్లో చాలా వరకు ఏఐ బేస్డ్ పిక్స్ ఉన్నాయంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్లు . 


Published Apr 03, 2025 08:24:00 PM
postImages/2025-04-03/1743692248_1500x900755724hcu.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో జరుగుతున్న అభివృధ్ధి  పనులు ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారి తీశాయి. రీసెంట్ గా సోషల్ మీడియా లో ఒక ఫొటోవైరల్ అయింది. ఆ ఫొటోలో జేసీబీలు భూమిని చదును చేస్తుండగా అక్కడున్న జింకలు , నెమళ్లు భయంతో పరుగులు తీస్తున్నాయి. అయితే ఈ కేసులో ఫుల్ వైరల్ అవుతున్న ఫొటో ఒకటి దానిపై వైరల్ అవుతుంది. అక్కడున్న జింకలు, నెమళ్లు భయంతో పరుగులు తీస్తున్నాయి. నిజానికి ఆ ఫోటోల్లో చాలా వరకు ఏఐ బేస్డ్ పిక్స్ ఉన్నాయంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్లు . 


ఈ వివాదంపై కాంగ్రెస్ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. రీసెంట్ గా కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి ఈ విషయంపై ట్విట్టర్ లో స్పందించారు. " ఇంత అధ్భుతమైన ఫొటోను తీసిన వ్యక్తి ఎవరో ముందుకు వస్తే రూ. 10 లక్షల రివార్డు ఇస్తాం. అని ఆయన ప్రకటించారు. కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని ఈ భూముల్లో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చెట్లు నరకవద్దని, ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన మధ్యంతర నివేదికను పరిశీలించిన తర్వాత సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.


 విద్యార్ధులు , పర్యావరణ ప్రేమికులు పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పర్యావరణ వేత్తలు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నారు. సుప్రీంకోర్టు స్టే వంటి పరిణామాలు రాజకీయంగాను , పర్యావరణ పరంగాను చర్చనీయాంశంగా మారాయి .
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu hyderabad congress-government

Related Articles