ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ , రెండు పాటలు రిలీజ్ అయ్యయి. రీసెంట్ గా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సిధ్ధూ జొన్నలగడ్డ , వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వస్తున్న రీసెంట్ మూవీ " జాకీ " కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్ . ఈ మూవీ ఏప్రిల్ 10 న ఆడియన్స్ ముందుకు రానుంది. ఎస్ వీ సీసీ బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ , రెండు పాటలు రిలీజ్ అయ్యయి. రీసెంట్ గా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
సిధ్ధు మార్క్ కామెడీ టైమింగ్ ని వాడుకుంటూనే యాక్షన్ , ఫన్ రెండింటిని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ బ్యాలెన్స్ చేసిన తీరు ఆసక్తి కొలిపేలా ఉంది. తన మిషన్ పేరు బటర్ ఫ్లై అంటూ సిధ్ధూ సందడి చేశారు ట్రైలర్ చివరల్లో రొమాన్స్ గురించి సిధ్ధూ చెప్పే డైలాగులు నాన్నగా యాక్ట్ చేసిన నరేశ్ తో పండించిన హాస్యం యూత్ ని టార్గెట్ చేసుకున్నాయి . అలాగే హీరోతో ప్రకాశ్ రాజ్ డిస్కర్షన్స్ కూడా ఆకట్టుకున్నాయి.