దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల వంట గ్యాస్ సిలండర్ ధర రూ . 1803 నుంచి రూ. 1762కు తగ్గింది. తగ్గించిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: చమురు మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరను భారీగా తగ్గింది . 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.41 తగ్గిస్తున్నట్లు కేంద్ర చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల వంట గ్యాస్ సిలండర్ ధర రూ . 1803 నుంచి రూ. 1762కు తగ్గింది. తగ్గించిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి.
ముంబైలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,714 .50 కి లభిస్తుంది. కోల్ కత్తాలో రూ. 1,872 కి చేరుకుంది. చెన్నైలో గతంలో రూ.1,965.50కాగా.. ప్రస్తుతం రూ.1924.50కి చేరుకుంది. హైదరాబాద్ లో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.44 తగ్గింది. దీంతో నిన్నటి వరకు రూ.2,029గా ఉన్న ధర రూ.1,985.50కు తగ్గింది. విశాఖపట్టణంలో 19కేజీల ఎల్పీజీ సిలిండర్ రేటు రూ.44.50 తగ్గింది. దీంతో ప్రస్తుత ధర రూ.1,817కు చేరింది. గత సంవత్సరం ఆగస్టు నెల తరువాత వీటి ధరల్లో మార్పు చోటు చేసుకోలేదు.