బుధవారంతో టెన్త్ పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో హాస్టల్స్ లో ఉంటూ సిటీలకు వచ్చి చదువుకునే విద్యార్ధులు సొంతూళ్లకు పయనమయ్యారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : టెన్త్ పరీక్షలు పూర్తికావడంతో ఫలితాలు ఎప్పుడు వెల్లడిస్తారనే విషయం చాలా చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ చివరి వారంలోనా...మే మొదటి వారంలో వస్తామయంటున్నారు. తెలంగాణలో మార్చి 21న ప్రారంభమైన టెన్త్ పరీక్షలు ఏప్రిల్ 2(బుధవారం)తో ముగిశాయి. మొత్తం 2,650 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. బుధవారంతో టెన్త్ పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో హాస్టల్స్ లో ఉంటూ సిటీలకు వచ్చి చదువుకునే విద్యార్ధులు సొంతూళ్లకు పయనమయ్యారు.
ఏప్రిల్ చివరి వారంలో లేదా మే నెలలో వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ టెన్త్ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ (https://www.bse.telangana.gov.in) లో తనిఖీ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఓరియంటల్ సైన్స్ కు సంబంధించిన రెండు ఎగ్జామ్స్ ఈ మంథ్ 3,4 తేదీల్లో జరుగుతాయి. వాటికి కొద్ది మంది మాత్రమే హాజరవుతారని అధికారులు తెలిపారు.టెన్త్ పరీక్షల్లో పలు ప్రాంతాల్లో క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటనలు మినహా పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు విద్యాశాఖ తెలిపింది.