గాయపడ్డ వారికి ప్లాట్ ఫామ్ మీదే చికిత్స అందిస్తున్నారు. మరోవైపు రైల్వే రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా రూట్లను మళ్లించారు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఒడిశాలో రైలు ప్రమాదం జరిగింది. నెరుగుండి కామాఖ్య ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఇన్సిడెంట్ లో దాదాపు 11 బోగీలు పక్కకు జరిగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా...చాలా మంది గాయపడ్డారు. కటక్ లోని నెరుగుండి రైల్వే స్టేషన్ సమీపంలో కామాఖ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిందని ఈస్ట్ కోస్ట్ రైల్వే సీపీఆర్ఓ అశోక్ కుమార్ మిశ్రా తెలిపారు.
ట్రైన్ ప్రమాదం గురించి వినిన వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ టీమ్ లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డ వారికి ప్లాట్ ఫామ్ మీదే చికిత్స అందిస్తున్నారు. మరోవైపు రైల్వే రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా రూట్లను మళ్లించారు.”ట్రైన్ నెంబర్ 12551 బెంగళూరు-కామాఖ్య ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుకి చెందిన 11 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే బెంగుళూరు కామాఖ్య ఏసీ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాం . గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరిలించి చికిత్స అందిస్తున్నారు. ఎన్డీ ఆర్ ఎఫ్ , ఒడిశా ఫైర్ సర్వీస్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంది. రైలు బెంగళూరు నుంచి అస్సాంలోని కామాఖ్య స్టేషన్ కు వెళ్తోంది.