liquor policy case: కవిత డిఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ

ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి ఢిల్లీ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో హాజరు పర్చారు. ఇప్పటికే పలు మార్లు కవిత బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, ఈ కేసులో సాక్షులుగా ఉన్నవారిని ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని ఈడీ, సీబీఐ ఆరోపించడంతో న్యాయస్థానం కవిత పిటిషన్లను కొట్టి వేసి ఆమె కస్టడీని పొడిగిస్తూ వస్తోంది. 
 


Published Jul 23, 2024 12:39:17 PM
postImages/2024-07-08/1720427015_modi15.jpg

న్యూస్ లైన్ డెస్క్: BRS ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఆమె.. నాలుగైదు నెలలుగా తీహార్ జైల్లోనే ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఈడీ, సీబీఐ ఆమెపై కేసు వేశాయి. 

దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి ఢిల్లీ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో హాజరు పర్చారు. ఇప్పటికే పలు మార్లు కవిత బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, ఈ కేసులో సాక్షులుగా ఉన్నవారిని ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని ఈడీ, సీబీఐ ఆరోపించడంతో న్యాయస్థానం కవిత పిటిషన్లను కొట్టి వేసి ఆమె కస్టడీని పొడిగిస్తూ వస్తోంది. 

అయితే, తాజగా సీబీఐ కేసులో డిఫాల్ట్‌ బెయిల్‌ కోరుతూ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆమె పిటిషన్‌పై సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. కాగా, కవితకు వ్యతిరేకంగా  దాఖలైన ఛార్జ్ షీట్‌లో తప్పులు ఉన్నాయని, తిరిగి ఫైల్ చేస్తామని గతంలో సీబీఐ తెలిపింది. 

అయితే, రీ ఫైలింగ్ చేసిన చార్జిషీట్‌లో కూడా తప్పులు ఉన్నాయని కవిత తరఫు లాయర్లు తెలిపారు. తప్పుల చార్జిషీట్ దాఖలు చేయడంతో.. డిఫాల్ట్ బెయిల్ నిబంధనలు తనకు వర్తిస్తాయని కవిత పిటిషన్ దాఖలు చేశారు. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu telanganam delhi mlc-kavitha delhi-liquor-policy-case

Related Articles