Sitaram Yechury:కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి గురించి తెలియని నిజాలు.!

కమ్యూనిస్టు నాయకులు అంటేనే ఒక ప్రశ్నల వర్షం అని చెప్పవచ్చు. పేద ప్రజల కోసం  ఎప్పుడు వారి గొంతును వినిపిస్తూనే ఉంటారు. అలాంటి కమ్యూనిస్టు యోధుల్లో


Published Sep 12, 2024 06:18:03 AM
postImages/2024-09-12/1726139697_SITHARAM.jpg

న్యూస్ లైన్ డెస్క్: (Sitaram Yechury passed away)కమ్యూనిస్టు నాయకులు అంటేనే ఒక ప్రశ్నల వర్షం అని చెప్పవచ్చు. పేద ప్రజల కోసం  ఎప్పుడు వారి గొంతును వినిపిస్తూనే ఉంటారు. అలాంటి కమ్యూనిస్టు యోధుల్లో అత్యంత పేరుగాంచినటువంటి నాయకుడు  సీతారాం ఏచూరి.  ఈయనను కమ్యూనిస్టు యోధుడిగా పిలుస్తారు. అలాంటి సీతారాం ఏచూరి  గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు తెలుసుకుందాం.. 

 కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఉన్నారు. మలయాళం, బెంగాలీ, తమిళం, తెలుగు, ఉర్దూ, పంజాబీ,  ఇంగ్లీష్, హిందీ, ఇలా ఎన్నో భాషల్లో అనర్గళంగా మాట్లాడే ఘనుడు. పార్లమెంటులో  ప్రజలకు సంబంధించి ఎలాంటి విషయాన్నైనా ప్రశ్నల వర్షంగా కురిపించే అద్భుతమైనటువంటి నాయకుడని చెప్పవచ్చు. ఈయన 1952 మద్రాస్ లో స్థిరపడ్డ తెలుగు కుటుంబంలో జన్మించారు. తండ్రి సర్వేశ్వర సోమయాజి, తల్లి  కల్పకం. సీతారాం విద్యాభ్యాసం అంత ఢిల్లీలోనే కొనసాగించారు. ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో పై చదువులు చదివిన సీతారాం, కాలేజీ టైం నుంచే విద్యార్థి ఉద్యమాల వైపు ఆకర్షితుడయ్యాడు.

దేశంలో ఎమర్జెన్సీ విధించిన టైంలో సీతారాం ఏచూరిని అరెస్టు చేశారు. సీతారాం సీమసిస్థి అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఈమె ఇండియన్ ఎక్స్ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఇక ఈయన రాజకీయ  ప్రస్థానం గురించి తెలుసుకోవాలంటే.. ఎస్ఎఫ్ఐ అనే విద్యార్థి సంస్థ ద్వారా విద్యార్థి నాయకుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీలో సభ్యునిగా చేరాడు. అలా విద్యార్థి నాయకుడిగానే అంచలంచలుగా ఎదిగి, చివరికి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.

1985లో భారత కమ్యూనిస్టు పార్టీ  కేంద్ర కమిటీలో, 1988లో కేంద్ర కార్యవర్గంలో, 1999లో పోలీట్ బ్యూరోలో పలు రకాల పదవులు అలంకరించారు. 2005లో బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఇక 2017లో విశాఖపట్నంలో జరిగినటువంటి 21వ మహాసభల్లో  జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.  2018లో  హైదరాబాదులో జరిగినటువంటి 27వ  మహాసభలో మళ్లీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

అలాంటి సీతారాం ఎక్కువగా పుస్తక పఠనం చేస్తూ ఉంటారు. ఈయనకు టెన్నిస్ ఆట అంటే ఎక్కువ ఇష్టం. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందుస్థాన్ టైమ్స్ లో ఈయన ఒక కాలం రాస్తారు. ఈయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యల వల్ల 2024 ఆగస్టు 19న  ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. అలాంటి ఏచూరి సెప్టెంబర్ 12, 2024న తుది శ్వాస విడిచారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu cpi sitharam-achuri sarweshwara-somayagi kalpaka, cpi-m seema-sisthi

Related Articles