BRS: కేసీఆర్ కీలక నిర్ణయం.. ఇకపై యువతకే పెద్దపీట

 రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలతో కూడా కేసీఆర్ సమావేశమయ్యారు. దీంతో పాటు వివిధ సంస్థల నివేదికలను కూడా పరిశీలించారు. మరోవైపు జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకొనే మార్పులు, BRS భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే కోణంలోనూ కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో ఇప్పటికే లోతుగా చర్చించారు. 
 


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-07/1720333636_Untitleddesign29.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు, మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో BRS ఓటమిని చవిచూసింది. అయితే, ఈ పరాజయం పార్టీపై తీవ్ర ప్రభావం చూపిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రతిపక్షంలో ఉండలేక పలువురు నేతలుకాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఇతర పార్టీలకు చెందిన నేతలు హద్దు మీరి ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కీలక నేతలతో వరుసగా భేటీలు ఏర్పాటు చేశారు. 

అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలతో కూడా కేసీఆర్ సమావేశమయ్యారు. దీంతో పాటు వివిధ సంస్థల నివేదికలను కూడా పరిశీలించారు. మరోవైపు జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకొనే మార్పులు, BRS భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే కోణంలోనూ కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో ఇప్పటికే లోతుగా చర్చించారు. 

ఈ మేరకే ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన నేతలకు కేసీఆర్ పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. పార్టీ జిల్లా, రాష్ట్ర కమిటీల్లో ప్రధాన పదవులు కూడా వారికే కేటాయించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఉద్యమంలో అండగా నిలిచిన ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి వర్గాలను కూడా మళ్లీ కలుపుకొని పోవడానికి కేసీఆర్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే పలువురితో సమావేశమై పార్టీ కీలక నేతలు చర్చలు జరుపుతున్నారు. ఇక వచ్చే నెలలో పార్టీ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.

newsline-whatsapp-channel
Tags : kcr news-line newslinetelugu brs telanganam politics cader

Related Articles