అక్కల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించిన సబితా.. తనను ఎద్దేశించే రేవంత్ ఆ మాటలు అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మొహం పెట్టుకొని సబితా ఇంద్రారెడ్డిపై అసెంబ్లీకి వచ్చారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ సహా పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సభను ఏకపక్షంగా జరుపుతున్న తీరుపై ప్రతిపక్ష నేతలు ఆందోలన చేపట్టారు. BRS ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ బయట బైఠాయించి నిరసన తెలిపారు. ఒక ఆడబిడ్డపై అనుచిత వ్యాఖ్యలు చేయదనే కాకుండా ప్రశ్నించే అవకాశం కూడా ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్కల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించిన సబితా.. తనను ఎద్దేశించే రేవంత్ ఆ మాటలు అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మొహం పెట్టుకొని సబితా ఇంద్రారెడ్డిపై అసెంబ్లీకి వచ్చారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దీంతో ఆడబిడ్డలను అవమానించే విధంగా మాట్లాడుతున్నారని సీఎంపై BRS ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో జరిగిన విషయం మహిళా ఎమ్మెల్యేలకే అవమానకరం కాదు. రాష్ట్రంలోని మహిళలు అందరికీ అవమానకరమని అన్నారు.
రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు నినాదాలు చేశారు. దీంతో అసెంబ్లీలోని మార్షల్స్ BRS ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ BRS ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గకపోవంతో అసెంబ్లీ బయటకు తీసుకొని వెళ్లారు. దీంతో అసెంబ్లీ బయట బైఠాయించి BRS ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. కేటీఆర్, హరీష్ రావు సహా ఎమ్మెల్యేలను అసెంబ్లీ బలవంతంగా తీసుకొని వెళ్లారు. పోలీస్ వాహనంలోకి ఎక్కించి వేరేచోటుకి తరలించారు.