జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాద సంస్థలతో గానీ , ఉగ్రవాదులతో గానీ సంబంధాలున్నట్లు ఇప్పటివరకూ మా దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు దొరకలేదు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పాకిస్థాన్ కు గూఢచర్యం చేస్తుందన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన హిరాయాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఆమెకు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు ఉన్నట్లు ఏం ఫిజికల్ అవిడెన్స్ లేదని హరియాణా పోలీసులు తాజాగా వెల్లడించారు. జ్యోతి మల్హోత్రా పూర్తి స్పృహతోనే పాకిస్థానీ నిఘా వర్గాల అధికారులతో సంప్రదింపులు జరిపారని పోలీసులు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి హిస్సార్ ఎస్పీ మరిన్ని వివరాలు వెల్లడించారు. జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాద సంస్థలతో గానీ , ఉగ్రవాదులతో గానీ సంబంధాలున్నట్లు ఇప్పటివరకూ మా దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే తాను సంప్రదింపులు జరుపుతున్న వ్యక్తులు పాకిస్థాన్ గూఢచార సంస్థకు చెందినవారని తెలిసినప్పటికీ జ్యోతి మల్హోత్రా వారితో టచ్‌లో ఉన్నారని ఎస్పీ పేర్కొన్నారు. భారత్ కు చెందిన బలగాల వ్యూహాలు , ప్రణాళికల గురించి ఆమెకు పెద్దగా అవగాహన ఉన్నట్లు దర్యాప్తులో కనిపించడం లేదని అన్నారు. మరింత సమాచారం తన నుంచి తెలుసుకోవాలని అన్నారు.