GOLD: భారత్ లో బంగారం అమ్మకాలు ఆపేస్తున్నారా !

ఇప్పుడు బంగారం గ్రాము 11 వేల రూపాయిల పైమాటే...ఇక రానున్న నాలుగు ఐదు నెలల్లో బంగారం 10 గ్రాములు 2  లక్షలు అయ్యే అవకాశముందని  సర్వేలు చెబుతున్నాయి.


Published Sep 18, 2025 10:38:00 AM
postImages/2025-09-18/1758172208_275221gold12345.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఏంటి బంగారం అమ్మడం ఆపేశారా ..నిజమే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో బంగారం అమ్మకాలు నిలిపివేశారు. పెద్ద పెద్ద షోరూమ్స్ లో కూడా మేకింగ్ ఛార్జీలు పెంచారు. డిజైన్స్ లేవంటూ తక్కువ డిజైన్స్ చూపించి బంగారం అమ్మకాలు ఆపేశారు. ఎందుకు ఇందంతా అంటే బంగారం రేట్లు మరింత పెరిగే అవకాశాలున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.  ఇప్పుడు బంగారం గ్రాము 11 వేల రూపాయిల పైమాటే...ఇక రానున్న నాలుగు ఐదు నెలల్లో బంగారం 10 గ్రాములు 2  లక్షలు అయ్యే అవకాశముందని  సర్వేలు చెబుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్ , కేరళ , తమిళనాడులో బంగారం అమ్మకాలు తక్కువ చేశారు వ్యాపారులు.  1 0 గ్రాముల బంగారం 2 లక్షలు అయ్యాకే అమ్మకాలు జరుపుతామన్నట్లు చెబుతున్నారట.  ఇప్పుడున్న దేశ , విదేశీ వ్యాపార పరిస్థితులు చూస్తే బంగారం పై పెట్టుబడులు దారుణంగా పెరిగాయి.దీంతో వ్యాపారులు తమ పెట్టుబడులను మరింత లాభాలు చేసుకోవాలనుకుంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : business price-drop goldrates

Related Articles