ఈ రెండు వేరియంట్లు కూడా జేఎన్.1 అనే మరో కొత్త వేరియంట్ నుంచి వచ్చిందనే అనుమానాలున్నాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పుంజుకుంటున్నాయి . మే 19 నాటికి దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి వ్యాప్తి పై ఆరోగ్యశాఖ అధికారులు . ఇప్పటికే . ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్ వంటి దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటం యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతుంది.కోవిడ్ విజృంభణకు ఎల్ఎఫ్.7, ఎన్‌బీ.1.8 అనే కరోనా వేరియంట్లు కారణమని నిపుణులు తేల్చారు. ఈ రెండు వేరియంట్లు కూడా జేఎన్.1 అనే మరో కొత్త వేరియంట్ నుంచి వచ్చిందనే అనుమానాలున్నాయి. అంతేకాదు ..ఇప్పుడు కోవిడ్ కేసులు కేరళ , తమిళనాడు, మహారాష్ట్రలో ఎక్కువగా నమోదవుతున్నాయి.
ఒమిక్రాన్ బీఏ.2.86 వేరియంట్ నుంచి జేఎన్.1 వేరియంట్ పుట్టుకొచ్చింది. దీన్ని తొలిసారిగా 2023 ఆగస్టు నెలలో గుర్తించారు. లాస్ట్ లో వచ్చిన వేరియంట్స్ అన్నింటికంటే ఈ వేరియంట్ కు వేగంగా వ్యాప్తి చెందే అవకాశముంది. దీనివల్ల, ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని సులభంగా ఛేదించి ఇన్‌ఫెక్షన్ కలుగజేస్తుంది. "బీఏ.2.86 వేరియంట్‌తో పోల్చినప్పుడు జేఎన్.1లో ఒక మ్యూటేషన్ అదనంగా ఉంది. ఈ మార్పు, వేరియంట్‌లోని స్పైక్ ప్రొటీన్‌లలో స్వల్ప మార్పులకు కారణమవుతుంది.
జేఎన్.1 వేరియంట్ సోకిన వారిలో సాధారణంగా పొడి దగ్గు, రుచి కోల్పోవడం, తలనొప్పి, ముక్కు దిబ్బడ, తీవ్రమైన అలసట, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ వేరియంట్ లో మోషన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ వేరియంట్ లో కోవిడ్ అంత తీవ్రంగా లేదని ...తగ్గుముఖం పడుతుందని తెలిపారు.