బీజేపీకి మోడీ బోర్ కొట్టిండా..దేశంలో  మోడీ చరిష్మా పడిపోయిందా..? 

ఒకప్పుడు దూకుడుగా వెళ్లిన ఆయన ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా మారిపోయారు. ఒకప్పుడు ఏం మాట్లాడినా.. ఏం చేసినా సంచలనంగా మారేది. కానీ ఇప్పుడు ఆయన మూడ్ ఆఫ్ లో ఎందుకున్నాడనే చర్చ


Published Sep 18, 2024 11:16:57 AM
postImages/2024-09-18/1726638417_modi.jpg

న్యూస్ లైన్ డెస్క్:ఒకప్పుడు దూకుడుగా వెళ్లిన ఆయన ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా మారిపోయారు. ఒకప్పుడు ఏం మాట్లాడినా.. ఏం చేసినా సంచలనంగా మారేది. కానీ ఇప్పుడు ఆయన మూడ్ ఆఫ్ లో ఎందుకున్నాడనే చర్చ జోరుగా వినిపిస్తోంది. అయితే ఆయన మౌనం వెనుక ఓ పెద్ద స్టోరీనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దేశంలో వరుసగా మూడోసారి అధికారం చేపట్టి బీజేపీ ఓ కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే గత రెండుసార్లు సొంతంగా అధికారంలోకి వచ్చిన కమలం పార్టీ, ఈసారి అధికారంలోకి రాలేకపోయింది. కూటమి సపోర్టుతోనే ప్రస్తుతం అధికారంలో నిలబడింది.

కూటమిలో కాస్త కుదుపు వచ్చినా ప్రభుత్వం కోల్పోవడం ఖాయం. దీంతో మోడీ దూకుడుకు కళ్లెం పడినట్లు అయ్యిందట. ఏం చేయాలన్నా ఇప్పుడు తమ కూటమిలో చర్చించాకే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయట. అందుకే కూటమి నేతలు ఆడించినట్లు మోడీ ఆడాల్సి వస్తోందట. కాదని ముందుకెళ్తే ఎక్కడ కూటమి వీగుతుందో అనే టెన్షన్‌లో ఉన్నారట ప్రధాని నరేంద్రమోడీ. ఒకప్పుడు తాను ఏదీ మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితులు ఉండేవి. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యిందట. 10 ఏళ్లు పనికొచ్చిన చరిష్మా ఇప్పుడు పని చేయడం లేదట. ఓ వైపు జనం కొంత దూరం కావడం, మరో వైపు పార్టీలోనూ కాస్త ప్రియారిటీ తగ్గిందట. గతంలో మోడీ అంటేనే బీజేపీ, బీజేపీ అంటేనే మోడీ అనే ప్రచారం ఉండేది. పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న మోడీదే. పేరుకు జాతీయ అధ్యక్షుడు ఉన్నా అంతా తానై చూసుకునేది. కానీ ఇప్పుడు అక్కడ కూడా బెడిసికొట్టిందట. పార్టీలోనూ మోడీ ఛరిష్మా పడిపోయిందట. కొంత కాలంగా వ్యక్తిగా నడిచిన పార్టీ ఇప్పుడు మళ్లీ ఓ వ్యవస్థగా నడుస్తోందట.

ఒకప్పుడు ఇచ్చినంత గౌరవం లేకపోవడం, పార్టీ మళ్లీ ఆర్ఎస్ఎస్ నేతలు చెప్పినట్లు వినాల్సి రావడంతో చేసేది లేక నరేంద్రమోడీ అలా మౌనంగా ఉండిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఎక్కువగా ఎక్కడికి వెళ్లడం లేదనే ప్రచారం జరుగుతోంది.  త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ మోడీని ఎక్కవగా ఇన్వాల్వ్ కావడం లేదట. గతంలో ఎన్నికలు జరుగుతున్నయంటే ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే పలుమార్లు పర్యటించినా మోడీ ఇప్పుడు ఎన్నికలు దగ్గరకొచ్చేంత వరకు వెళ్లడం లేదట. ఇప్పుడు కూడా కొన్ని సభలకే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. పార్టీ సైతం మోడీకి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

newsline-whatsapp-channel
Tags : telangana chandrababu pawankalyan newslinetelugu bjp india pm-modi

Related Articles