ఢిల్లీ పెద్దలకు రేవంత్ కు చెడింది అక్కడేనా.. కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది.?

అతి అనర్ధాలకు దారి తీస్తుందనే మాట రేవంత్ రెడ్డి విషయంలో నూటికి నూరు పాళ్లు నిజమవుతోందట. ఆయన చేస్తున్న పనులతో మొహం చూడడానికి హైకమాండ్ కూడా ఇష్టపడటం లేదట. అందుకే


Published Sep 18, 2024 11:36:16 AM
postImages/2024-09-18//1726639576_90.jpg

న్యూస్ లైన్ డెస్క్:అతి అనర్ధాలకు దారి తీస్తుందనే మాట రేవంత్ రెడ్డి విషయంలో నూటికి నూరు పాళ్లు నిజమవుతోందట. ఆయన చేస్తున్న పనులతో మొహం చూడడానికి హైకమాండ్ కూడా ఇష్టపడటం లేదట. అందుకే ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా..సోనియాగాంధీ ఇంటి ముందు ఎన్ని ప్రదక్షిణలు చేసినా... కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదట. ఏదో ఒక ప్రోగ్రామ్ వంకతో కలవాలని చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయట. బయటకు ఏవేవో కారణాలు చెప్పుకుంటున్నా.. కావాలనే అధిష్టానం పెద్దలు దూరం పెడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.  వారికి దగ్గరయ్యేందుకు రేవంత్ రెడ్డి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారట. సోనియా, రాహుల్ ను రాష్ట్రానికి తీసుకొచ్చి పార్టీలో తన ప్రాధాన్యత తగ్గలేదని నిరూపించుకోవాలని ఆరాటపడుతున్నారట.

కానీ ఏ ప్రయత్నాలు కూడా సఫలీకృతం కావడం లేదంటున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సోనియా గాంధీని ఆహ్వానించారు. అయితే రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు అమలు కాకపోవడంతో సోనియా రాలేదన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత రైతు కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించారు. కానీ పూర్తిస్థాయిలో రుణమాఫీ కాకపోవడంతో రాహుల్ గాంధీ రానని మొహం మీదే చెప్పారట. దీంతో రైతు కృతజ్ఞత సభను వాయిదా వేసుకున్నారని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరిస్తే సోనియా, రాహుల్ వస్తారని రేవంత్ ఆశలు పెట్టుకున్నారట. దీనికోసం ఏకంగా సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నట్లు ప్రకటించారు. మొదట ఆగస్టు 20న రాజీవ్ గాంధీ జయంతి రోజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ వస్తారని ప్రచారం చేశారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని యావత్ తెలంగాణ సమాజం వ్యతిరేకించింది. తెలంగాణ పౌర సమాజం కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాసింది. దీంతో ఆ ప్రయత్నం కూడా తుస్సుమందట.  రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణను నెలరోజుల పాటు వాయిదా వేసుకున్నా ఢిల్లీ పెద్దలు కనికరించలేదని సమాచారం. ఈ మధ్యే ఢిల్లీ వెళ్లినప్పుడు పెద్దలు పట్టించుకోకపోవడంతో.. మీడియాతో చిట్ చాట్ చేసి.. ఇష్యూను డైవర్ట్ చేసి రాష్ట్రానికి వచ్చేశారట. ఢిల్లీ నుంచి ఏమాత్రం సహకారం లేకపోవడంతో పాటు రాష్ట్ర నేతల నుంచి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఒత్తిడి మొదలైందట. సీనియర్లు చెప్పింది వినకుండా ఇష్టానుసారంగా చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే కొంత మంది సీనియర్లు మొహం మీదే చెప్పారట. రాహుల్, సోనియా కోసం మరికొంత కాలం ఎదురు చూసినా ఉపయోగం ఉండదని తేల్చి చెప్పారట. దీంతో అతిథులు ఎవరు లేకుండా.. ఆయన ముఖ్య అతిథిగా మారి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారట. అధిష్టానం పెద్దలు రేవంత్ ను దూరం పెట్టడానికి కారణాలు లేకపోలేదంటున్నారు. ఒకప్పుడు రేవంత్ ఏదీ చెప్పినా విన్న అధిష్టానం, ఇప్పుడు ఆయన మొహం చూడకపోవడానికి చాలా కారణాలున్నాయట.

ఒంటెద్దు పోకడలు, ప్రైవేటు దందాలు, సెటిల్‌మెంట్లు, అన్నదమ్ముల వ్యవహారాలు, సీనియర్లను పట్టించుకోకపోవడంపై ఢిల్లీ పెద్దలు  గుర్రుగా ఉన్నారట. దీనికితోడు బీఆర్ఎస్ నుండి ఫిరాయింపులను మేనేజ్ చేయడంలో ఫెయిల్ కావడం. జాతీయ స్థాయిలో విమర్శలు రావడంతో గాంధీ ఫ్యామిలీ గుర్రుగా ఉందనే ప్రచారం ఢిల్లీలో జరుగుతోంది. అందుకే ఈ మధ్య అపాయింట్ మెంట్లు కూడా ఇవ్వడం లేదంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana news-line cm-revanth-reddy rahul-gandhi congress-government sonia

Related Articles