కాగా, ఫారెస్ట్ క్లియరెన్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని మల్లేష్ తెలిపారు. తన ట్రాక్టర్‌ను కొంతమంది రైతులకు మాత్రమే కిరాయికి ఇచ్చానని అన్నాడు. అయితే, ఇలాంటి కేసులో మల్లేష్ ఇప్పటికే రిపీట్ అఫెండర్‌గా ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు ఆధారాలు చూపించారు.
న్యూస్ లైన్ డెస్క్: అటవీ భూమిని దున్నినందుకు ఓ రైతుకు తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఓవైపు అడవులు తగ్గిపోతుంటే మరోవైపు తమ స్వార్ధం కోసం చెట్లను నరికేస్తున్నందుకు న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
బెల్లంపల్లిలోని కుశేన్‌పల్లి ఫారెస్ట్ రేంజ్‌లో 2 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమిని మల్లేష్ అనే రైతు దున్నించి, చదును చేసినట్లు గుర్తించిన అటవీశాఖ అధికారులు అతని ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. అయితే, ఈ కేసుపై కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ విచారణ జరిపారు. అటవీ ప్రాంతాలను, పచ్చదనాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. అడవులలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
కాగా, ఫారెస్ట్ క్లియరెన్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని మల్లేష్ తెలిపారు. తన ట్రాక్టర్‌ను కొంతమంది రైతులకు మాత్రమే కిరాయికి ఇచ్చానని అన్నాడు. అయితే, ఇలాంటి కేసులో మల్లేష్ ఇప్పటికే రిపీట్ అఫెండర్‌గా ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు ఆధారాలు చూపించారు. దీంతో చదును చేసిన భూమిలో ఎకరానికి 100 మొక్కలు నాటాలని మల్లేష్‌కు జడ్జి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, రూ.5 వేల పూచీకత్తు చెల్లించాలని ఆదేశించారు. అప్పటి వరకు ట్రాక్టర్‌ను తిరిగి ఇవ్వొద్దని స్పష్టం చేశారు.