GOLD: భారీగా పెరిగిన బంగారం ధర ..ఇప్పుడు గ్రాము ధర ఎంతంటే !

బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 3,360 డాలర్లు ఉండగా గురువారం నాటికి 13 డాలర్లు పెరిగి 3,373 డాలర్లకు చేరుకుంది.


Published Jun 05, 2025 10:54:00 AM
postImages/2025-06-05/1749101476_indiasfestivegoldbuyingspreecontinuesdefyingrecordprice.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బంగారం ధర దారుణంగా పెరుగుతుంది. మొన్నే రికార్డు స్థాయిలో బంగారం ధరలు నడుస్తున్నాయి. ఇప్పుడు పది గ్రాముల బంగారం 24 క్యారట్ల బంగారం ధర రూ.లక్షకు చేరువైంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు పెరిగాయి. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 3,360 డాలర్లు ఉండగా గురువారం నాటికి 13 డాలర్లు పెరిగి 3,373 డాలర్లకు చేరుకుంది.


భారతదేశంలో గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 24క్యారట్ల 10గ్రాముల బంగారంపై రూ. 430 పెరగ్గా.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారంపై రూ. 400 పెరిగింది. గత నాలుగు రోజుల్లో బంగారం 10 గ్రాములు 24 క్యారట్ల గోల్డ్ పై 2,290 పెరిగింది. రాబోయే రోజుల్లో గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వెండి కూడా బంగారం తో పోటీ పడుతుంది. ఇప్పుడు కేజీ వెండి వెయ్యి రూపాయిలు పెరిగింది. నాలుగు రోజుల్లో కిలో వెండిపై రూ. 3,100 పెరిగింది.


* హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.90,900 కాగా.. 24 క్యారట్ల ధర రూ.99,170కి చేరింది.


* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,450 కాగా.. 24 క్యారట్ల ధర రూ.99,750కు చేరింది.


ఇక వెండి ధర ఈ రోజు పెరిగింది.  దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.రూ.1,14,000 వద్ద కొనసాగుతుంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business goldrates silver-rate

Related Articles