విమాన యాన భద్రత సర్వీసులకు ఆటంకమో ఆకతాయిలకు అర్ధం కావడం లేదు ..ఇక పై ఇలాంటి కాల్స్ చేసే వారికి శిక్షలు తప్పవని తెలిపారు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: విమానాల బెదిరింపులకు పాల్పడేవారిని నోఫ్లై జాబితాలో చేర్చేలా చట్టాలు తీసుకొస్తున్నామని తెలిపారు పౌర విమానయాన శాఖ మంత్రి తెలిపారు. ఒక్క రోజులో దాదాపు 70 విమానాలకు బెదిరింపు కాల్స్ రావడం మాటలు కాదు. ఎంత మందికి ఇది ఇబ్బంది కలిగించిందో ఎన్ని విమాన యాన భద్రత సర్వీసులకు ఆటంకమో ఆకతాయిలకు అర్ధం కావడం లేదు ..ఇక పై ఇలాంటి కాల్స్ చేసే వారికి శిక్షలు తప్పవని తెలిపారు. గత పది రోజులుగా ఈ కాల్స్ వస్తున్నట్లు తెలిపారు.
విమానంలో బోర్డింగ్ అయ్యాక బెదిరింపులకు పాల్పడేవారికి వేసే శిక్షలపై చట్టంలో సెక్షన్లు ఉన్నాయన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉంటూ బెదిరింపులకు పాల్పడేవారికి కూడా ఇవి వర్తించేలా మార్పులు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఇక పై విమానంలో ఇలాంటి బెదిరింపు కాల్స్ చేసినా ..జీవిత కాల శిక్షలు వేస్తామని తెలిపారు విమానయాన శాఖ మంత్రి .
ఎయిరిండియా, విస్తారా, ఇండిగో, ఆకాశ్ ఎయిర్ సంస్థలకు చెందిన పదుల సంఖ్యలో విమానాలకు నకిలీ బెదిరింపులు వచ్చాయి. 11 రోజుల వ్యవధిలో 250కి పైగా విమానాలకు బెదిరింపు ఫోన్లు వచ్చాయి. కాల్స్ కారణంగా సర్వీసులు ఆపలేక ..షెడ్యూల్ మార్చలేక చాలా ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. ఆకతాయిల పనే అయినా దీనికి తగిన శిక్ష తప్పదని తెలిపారు.