దసరా ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. జంబూ సవారీ జరిగాయి. గజరాజు మీద స్వర్ణ అంబారీ ఉంచి అందులో చాముండేశ్వరీ దేవి విగ్రహాన్ని ఊరేగించారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కర్ణాటకలోని మైసూరు రాజకోటలో దసరా ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. జంబూ సవారీ జరిగాయి. గజరాజు మీద స్వర్ణ అంబారీ ఉంచి అందులో చాముండేశ్వరీ దేవి విగ్రహాన్ని ఊరేగించారు. స్వర్ణ అంబారీ కట్టిన ఏనుగుతోపాటు మొత్తం మరిన్ని గజరాజులు కూడా వేడుకల్లో పాల్గొన్నాయి. శనివారం సాయంత్రం కర్ణాటక అధికారులు , ప్రముఖుల ఆధ్వర్యంలో చాలా అందంగా జరిగింది.
కళాకారులు, సంగీత వా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కనిపించేలా చేశారు.
జంబూ సవారీ లో భారీ బందోబస్తు పెట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహా మరిన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు. బంగారు రధంపై ఛాముండేశ్వరీ దేవీ ని చూడ్డానికి రెండు కళ్లు సరిపోలేదంటే నమ్మండి. అయితే ఈ రథం మొదట చెక్కతో తయారుచేయించి తర్వాత 80 కేజీల బంగారంతో తాపడం చేస్తారు. శ్రీ జయచామ రాజేంద్ర వడయార్ చివరిగా బంగారు అంబారీలో కూర్చోని ఊరేగింపులో పాల్గొన్నారు. 1970 వ దశకంలో మైసూర్ దసరా ఉత్సవాల నిర్వహణకు కొన్ని ఇబ్బందులు ఎదురైన తర్వాత తర్వాత కర్ణాటక ప్రభుత్వ సాయంతో ఉత్సవాలు చేస్తున్నారు.